Begin typing your search above and press return to search.

నిన్న బ్రహ్మం గారు..నేడు అమెరికా రచయిత్రి:కరోనాను ముందే ఊహించారా?

By:  Tupaki Desk   |   4 March 2020 9:30 PM GMT
నిన్న బ్రహ్మం గారు..నేడు అమెరికా రచయిత్రి:కరోనాను ముందే ఊహించారా?
X
కరోనా వైరస్‌ ను ప్రపంచాన్ని వణికిస్తుందని కొంతమంది ముందే ఊహించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వీరబ్రహ్మేంద్రస్వామి నాడే చెప్పారంటూ ఓ క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈశాన్య దిక్కున విష గాలి పుట్టెను అని పద్యంలో చెప్పింది కరోనా గురించేనని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా కథనాలు వస్తున్నాయి. అమెరికా రచయిత్రి సిల్వియా బ్రౌస్ పన్నెండేళ్ల క్రితమే తాను రాసిన ఎండ్ ఆఫ్ డేస్ పుస్తకంలో కరోనా గురించి ప్రస్తావించారట.

ఈ మేరకు ఆ పుస్తకంలోని కొన్ని ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. అందులో ఇలా ఉంది.. 2020 సమయంలో న్యూమోనియాను పోలిన ఓ జబ్బు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని - ఊపిరితిత్తులు - శ్వాసనాళాలపై ప్రభావం చూపిస్తుందని - ఈ వ్యాధి చికిత్స కష్టతరంగా మారుతుందని - అయితే ఇది ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా మాయమవుతుందని - ఈ జబ్బు మళ్లీ పదేళ్ల తర్వాత విజృంభిస్తుందని - ఆ తర్వాత పూర్తిగా కనుమరుగు అవుతుందని ఆ పుస్తకంలో పేర్కొన్నట్లుగా ఉంది.

అచ్చం ఆమె తన బుక్‌ లో రాసినట్లుగా ప్రస్తుతం కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని, పుష్కర కాలం క్రితమే ఆమె దీనిని ఊహించారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డీన్ కూన్జ్ అనే రచయిత నలభై ఏళ్ల క్రితం ది ఐస్ ఆఫ్ డార్క్ అనే నవలలో ఓ వైరస్‌ కు వూహాన్ 400 అనే పేరు పెట్టారు. వూహాన్ వెలుపల ఓ ల్యాబ్‌లో దీనిని తయారు చేస్తారని, ఇది మనుషులపై ప్రభావం చూపుతుందని ఆ నవలలో ఉంది. ఈ ఇది కూడా వైరల్‌ గా మారింది.