Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు అంత సీన్ లేదంటున్న అమెరిక‌న్లు!

By:  Tupaki Desk   |   27 April 2017 1:49 PM GMT
ట్రంప్‌ కు అంత సీన్ లేదంటున్న అమెరిక‌న్లు!
X
రిప‌బ్లిక‌న్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష పీఠం అదిష్టించించిన మూడు నెల‌లు దాటిన నేప‌థ్యంలో అమెరిక‌న్‌ లు త‌మ అధ్య‌క్షుడిపై ఆస‌క్తిక‌ర‌మైన స్పంద‌న వెలువ‌రించారు. టైమ్‌-స‌ర్వేమంకీ నిర్వ‌హించిన ఒపినియ‌న్ పోల్ లో ఆశ్చ‌ర్య‌పోయే రిప్లైలు ఇచ్చారు. ఆయ‌న‌కు హామీలు అమ‌లు చేసే స‌త్తా లేద‌ని తేల్చేశారు. అంతేకాదు ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న ప్ర‌జ‌ల‌ శాతం కూడా త‌గ్గిపోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నెల 24న నిర్వ‌హించిన ఈ పోల్‌ లో ఎన్నిక‌ల్లో చేసిన హామీల‌ను ట్రంప్ నెర‌వేరుస్తారా అనే ప్ర‌శ్న‌సంధించారు. అయితే ఇందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. కేవ‌లం 25 శాతం అమెరిక‌న్లే ట్రంప్ త‌న హామీ నెర‌వేరుస్తార‌ని న‌మ్ముతున్నారు. ట్రంప్‌ మ‌ద్ద‌తుదారుల అభిప్రాయం తెలుసుకోవ‌డం కోస‌మే ఈ పోల్ నిర్వ‌హించిన‌ట్లు అపోజింగ్‌ వ్యూస్‌.కామ్ వెల్ల‌డించింది. అయితే ఈ తాజా స‌ర్వేలో ట్రంప్‌ కు మ‌రో ఆరు శాతం ఆద‌ర‌ణ త‌గ్గిన‌ట్లు తేలింది. ఇలాంటిదే పోల్ ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించిన స‌మ‌యంలో 31 శాతం మంది ట్రంప్ హామీలు నెర‌వేరుస్తార‌ని చెప్పారు.

కాగా, ఈ స‌ర్వేలో ట్రంప్ వీరాభిమానులుగా చెప్పుకొనే 3 శాతం మంది ఆయ‌న‌కు ఓటు వేసినందుకు ఫీల‌వుతున్న‌ట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 29తో ట్రంప్ ఓవ‌ల్ ఆఫీస్‌ లో కూర్చొని వంద రోజులు పూర్త‌వ‌నుంది. ఫ్రాంక్లిన్ రూజ్‌ వెల్ట్ కాలం నుంచి అధ్య‌క్షుని ప‌నితీరుపై ఇలాంటి స‌ర్వేలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ట్రంప్ మాత్రం ఈ సాంప్ర‌దాయాన్ని విమ‌ర్శించారు. ఇది స‌రైన‌ది కాద‌ని, వంద రోజులు అన్న‌ది ఓ కృత్రిమ అడ్డంకి మాత్ర‌మే అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/