Begin typing your search above and press return to search.
బైడెన్ కి షాకిచ్చిన అమెరికన్లు.. 66 శాతం మందిలో వ్యతిరేకత..!!
By: Tupaki Desk | 21 Jan 2022 2:49 AM GMTఅమెరికా అధ్యక్షుడు కావడం అంటే మాటలు కాదు. ప్రపంచం మొత్తాన్ని శాసించే ఒక శక్తి అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయిన వ్యక్తి కి ఉంటుంది. ప్రపంచంలోని ఎన్నో దేశాల పై ఆధిపత్యం చలాయించే గల అధికారం కేవలం ఒక్క అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాల మీద చాలా దేశాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే అంత హడావిడి. అయితే వీటన్నిటిని దాటుకుంటూ అధ్యక్ష పోరులో డోనాల్డ్ ట్రంప్ పై అత్యధిక మెజారిటీ సాధించి గెలుపు పొందిన వ్యక్తిగా జో బైడెన్ రికార్డు సృష్టించారు. అయితే అతి తక్కువ కాలంలోనే బైడెన్ కి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో బయటకి వ్యతిరేకంగా అమెరికన్ లో ఓటు వేశారు చాలామంది వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేయ వద్దని అంటున్నారు. దీనికి కారణం అతని పరిపాలనపై ప్రజలకు ఉన్న అసంతృప్తి. అమెరికన్లలో జో బైడెన్ పాలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఈ సర్వేలో తేలింది. ఈ అధ్యక్షుడుకు పరిపాలన దక్షత లేదని సర్వేలో పాల్గొన్న చాలా మంది పేర్కొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జో బైడెన్ పాలనపై చాలామంది అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు నిదర్శనంగా ఇటీవల ఎన్ఓఆర్సీ అనే ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే లో 66 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమైంది. వీరిలో సుమారు 50 శాతం మందికి పైగా బైడెన్ ను 2024లో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేయొద్దని సూచించినట్లు సర్వే సంస్థ తెలిపింది. ఆయన పరిపాలన పై కేవలం 43 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం చేసింది. అగ్రరాజ్య అధ్యక్షుడిగా బైడెన్ విఫలమైనట్లు అమెరికన్లు భావిస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా ఆయనపై వ్యతిరేకత ఇంకా పెరుగుతోందని చెప్పింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేతబట్టి ఏడాదిగా వస్తున్న తరుణంలో ఓ మీడియా సంస్థ ఈ సర్వేను నిర్వహించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికన్లు తమ అసంతృప్తి వెళ్లగక్కినట్లు స్పష్టమైంది.
జో బైడెన్ అసంతృప్తి తీవ్రస్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం ఆకాశాన్నంటిన ధరలు. ట్రంప్ హయాంలో ఉన్న ధరలతో పోల్చితే నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు సర్వేలో పాల్గొన్న చాలా మంది చెప్పారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి అడ్డుకోవడంలో కూడా విఫలం అయినట్లు పేర్కొన్నారు. దీంతోనే ఆయన గ్రాఫ్ ఏడాదిలోనే భారీగా పడిపోయినట్లు చెప్పారు. జులైలో కూడా ఈ సంస్థ ఎలాంటి సర్వేనే నిర్వహించింది. ఆ సమయంలో కూడా ఎక్కువ మంది జో బైడెన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే అదే సర్వేను సెప్టెంబర్ లో నిర్వహించగా 50 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.
ప్రత్యేకించి కరోనా నియంత్రణ చర్యలను చేపట్టడంలో అమెరికా అధ్యక్షుడు విఫలమయ్యారని చాలా మంది భావిస్తున్నారు. తమ అసంతృప్తికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. అంతేగాకుండా ఎంతో కీలకమైన ఆఫ్ఘనిస్తాన్ పై పట్టును కోల్పోయే ఎందుకు బయట తీసుకున్నా నిర్ణయాలే కారణమని అమెరికన్లు భావిస్తున్నారు. ఒక అమెరికన్ సిటిజన్ గా శారీరకంగా మానసికంగా బైడెన్ తగిన వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. శ్వేత సౌధాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించే సత్తా ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికి లేదని అమెరికన్లలో 38 శాతానికి పైగా మంది చెప్పారు. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేసిన వ్యక్తిగా చాలామంది బైడెన్ ను మెచ్చుకున్నారు.