Begin typing your search above and press return to search.
ఇజ్రాయెల్ తర్వాత మాస్కు లేకుండా తిరిగే లగ్జరీ అగ్రరాజ్యంలో!
By: Tupaki Desk | 28 April 2021 4:21 AM GMTముఖానికి మాస్కు లేకుండా వీధుల్లో తిరగటం పెద్ద విషయం కాదు. కానీ.. అదంతా ఒకప్పుడు. ఇవాల్టి రోజున ఇంట్లోనూ మాస్కు పెట్టుకోవాలన్న దరిద్రపుగొట్టు రోజులు రావటం తెలిసిందే. కరోనా లాంటి కష్టకాలంలో ముఖానికి మాస్కు లేకుండా తిరిగే భాగ్యం.. కచ్ఛితంగా లగ్జరీనే అవుతుంది. ఇలాంటి విలాసాన్ని తమ ప్రజలకు అందించిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ప్రపంచంలో మరే దేశం చేయని ప్రకటనను ఆ దేశం చేసింది.
ముఖానికి మాస్కు లేకుండా వీధుల్లో తిరిగే అవకాశాన్ని కల్పిస్తూ.. అధికారిక ప్రకటన చేసింది. దీన్ని చూసిన చాలా దేశాలు.. తమకు ఆ అవకాశం లేకుండా పోయిందన్న వేదన చెందారు. తాజాగా అదే జాబితాలోకి మరో దేశం నిలిచింది. అదే.. అగ్రరాజ్యమైన అమెరికా. అమెరికాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.
ఇప్పటికి విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం అమెరికాలోని యుక్తవయసు ఉన్న వారిలో సగం మందికి పైనే వ్యాక్సిన్ అందింది. ఈ నేపథ్యంలో అమెరికా అంటువ్యాధుల నివారణ కేంద్రం ఆసక్తికర ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ముఖానికి మాస్కు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాత్రం మాస్కు పెట్టుకోవటం మంచిదన్న సూచన చేసింది.
కరోనా కారణంగా కోల్పోయిన స్వాతంత్య్రాన్ని అమెరికా తిరిగి తెచ్చుకుందంటూ ఆ దేశానికి చెందిన ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ మైక్ సాగ్ రియాక్టు అవుతూ.. అమెరికాలో స్వాతంత్య్రం తిరిగి వచ్చిందని.. ఆగ్రరాజ్యంలో మామూలు పరిస్థితులు నెలకొన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ముఖానికి మాస్కు లేకుండా బయటకు వెళ్లే.. ప్రాథమిక స్వేచ్ఛను కల్పించిన రెండో దేశంగా అమెరికా నిలుస్తుందని చెప్పాలి.