Begin typing your search above and press return to search.
ట్రంప్ పిచ్చి సలహా..గుడ్డిగా నమ్ముతున్న అమెరికన్లు
By: Tupaki Desk | 26 April 2020 7:10 AM GMTకరోనా విజృంభిస్తూ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఏం చేయాలో పాలుపోవడం లేదు. వైరస్ ప్రబలిన సమయంలో స్పందించని ట్రంప్ తాపీగా ఇప్పుడు స్పందించి నివారణ చర్యలకు పూనుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని ఆశ్చర్యకర ప్రకటనలు చేస్తున్నాడు. తాజాగా అతడు కరోనా నివారణకు క్రిమీ సంహారక మందు, సూర్య కిరణాలతో తగ్గుతుందని ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వైరస్ నియంత్రణకు అతడు వింత వింత సలహాలు ఇస్తున్నారు.
కరోనా వైరస్‌ను రోగి శరీరం నుంచే బయటికి పంపేయాలంటే అతినీల లోహిత కిరణాలతో పాటు క్రిమి సంహారకాలను చొప్పిస్తే చాలు అని చేసిన సూచనలపై అందరూ ఖండిస్తున్నారు. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ విధంగా సలహాలు ఇవ్వడంపై భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ట్రంప్ సలహా ఇవ్వడం ఒకే కానీ అతడి పిచ్చి సలహాను అమెరికా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఈ క్రమలో తమ అధ్యక్షుడు సూచించిన క్రిమి సంహారకాల గురించి సెర్చ్ ఇంజన్ గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. క్రిమిసంహారకాలు ఎందులో ఉంటాయో ట్రంప్ చెప్పకపోవడంతో ఆ దేశ ప్రజలు గూగుల్‌లో ఆ క్రిమీ సంహారకాలు వేటిలో ఉన్నాయని తెగ వెతుకుతున్నారు. వ్యాక్సిన్ల నుంచి విటమిన్ల వరకూ అన్నీ వెతికేస్తున్నారు.
గతంలో కూల్ డ్రింక్స్‌లో క్రిమి సంహారకాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇప్పుడు కూల్‌డ్రింక్స్ తాంగేందుకు సిద్ధమవుతున్నారంట. క్రిమిసంహారకాలు ఉన్న ఆహార పదార్ధాలు - వ్యాక్సిన్లు - విటమిన్ల కోసం అమెరికన్లు గూగుల్‌లో వెతకడం వారి అవివేకానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. కరోనా కేసులు తీవ్రంగా ప్రబలుతున్న సమయంలో వాటిని నియంత్రించలేక ఏదో సలహా ఇస్తే దాన్ని ప్రజలు గుడ్డిగా నమ్మడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి తీరుకు ఇతర దేశాల ప్రజలు నవ్వుతున్నారు.