Begin typing your search above and press return to search.
అమెరికన్లు బాబును పాకిస్థానీ అనుకున్నారా?
By: Tupaki Desk | 27 Aug 2016 4:25 AM GMTఈ ప్రశ్నకు సింఫుల్ గా.. సూటిగా సమాధానం చెప్పాలంటే.. ‘అవును’ అని చెప్పాల్సిందే. చంద్రబాబును పాకిస్థానీ అని అమెరికన్లు ఎలా అనుకుంటారు? హైదరాబాద్ లాంటి మహానగరానికి ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చినట్లుగా తరచూ తనకుతాను చెప్పుకునే బాబును పాకిస్థానీ అనుకునే ఛాన్స్ లేదుగా అన్న సందేహం రావొచ్చు. నిజమే.. మీ సందేహంలో అర్థం ఉంది. బాబును పాకిస్థానీ అనుకున్నది ఇప్పడు కాదు.. ప్లాష్ బ్యాక్ లో. తొమ్మిదిన్నరేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. హైదరాబాద్ గురించి ప్రపంచానికి కాస్త తక్కువగా తెలిసిన రోజుల్లో (ఈ మాటను మేం చెప్పటం లేదు చంద్రబాబు చెప్పిన మాటను జస్ట్ ప్రస్తావిస్తున్నామంతే) బాబును పాకిస్థానీ అనుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తం చేయటానికి ఆయన అమెరికాకు వెళ్లిన ఆ రోజుల్లో.. ఎక్కడి నుంచి వచ్చారని అమెరికన్లు అడిగితే చంద్రబాబు ‘హైదరాబాద్’ నుంచి వచ్చినట్లు చెప్పారట. దీంతో ఆయన్ను పాకిస్థానీ అనుకున్నారట. ఎందుకంటే.. పాకిస్థాన్ లోనూ హైదరాబాద్ అనే నగరం ఉంది. అందుకే.. బాబు ను అమెరికన్లు అలా అనుకున్నారన్న మాట.
బాబు మాటల్ని విన్నప్పుడు కొన్ని సందేహాలు చటుక్కున మనసులోకి వచ్చేస్తాయి. అలాంటి డౌట్లలో మొదట వచ్చేదేమిటంటే.. ఎవరైనా సరే ఫారిన్ కంట్రీకి వెళ్లినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే.. ఇండియా నుంచి అని చెబుతారే కానీ.. అంబాజీపేట నుంచి అనో.. లేదంటే మైసూర్ అనో.. మాదాపూర్ నుంచో వచ్చినట్లుగా చెప్పరు కదా? ఇప్పుడంటే భారత్ గురించి అందరూ ఎంతోకొంత మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు చెప్పిన మాటల ప్రకారం ఆయన చెప్పింది దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగినట్లుగా చెప్పొచ్చు. అప్పట్లో ఇండియానే వరల్డ్ లో అంత పెద్ద ఫేమస్ కాదు.
ఎక్కడో అమెరికన్ల వరకూ ఎందుకు.. 20 ఏళ్ల క్రితం ఆసియాలోని జపాన్ దేశస్తులు చాలామందికి ఇండియా అంటే.. అదెక్కడి దేశమో అని అనుకునే దుస్థితి. అలాంటిది సదూరాన ఉన్న అమెరికావోడికి ఆంధ్రప్రదేశ్ గురించి.. అక్కడి హైదరాబాద్ నగరం గురించి తెలిసే ఛాన్స్ తక్కువే. ఆ సంగతుల్ని పక్కన పెట్టినా.. ఇండియా నుంచి వచ్చినట్లు చెప్పి.. ఆ తర్వాత ఏ ప్రాంతం నుంచి వచ్చింది చెప్పటం కామన్. ఇందుకు భిన్నంగా బాబు వ్యవహరించటం ఏమిటో..? సో.. అమెరికన్లు బాబును పాకిస్థానీ అనుకోవటం కేవలం బాబు మాటల వల్లే అనుకోవచ్చేమో..?