Begin typing your search above and press return to search.

భారతీయు వైద్యురాలిని సర్ ప్రైజ్ చేసిన అమెరికన్లు

By:  Tupaki Desk   |   21 April 2020 5:30 PM GMT
భారతీయు వైద్యురాలిని సర్ ప్రైజ్ చేసిన అమెరికన్లు
X
అమెరికాలో ఒక ఎన్నారై వైద్యురాలికి సరికొత్త అనుభవం ఎదురైంది. అమెరికా, -ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ దేశాల్లో మన డాక్టర్లు మారుమూలల్లో కూడా స్థిరపడ్డారు. మంచి వైద్యులుగా పేరు తెచ్చుకున్నారు. ఐటీ వారి కంటే కూడా మన వైద్యులు 40-50 ఏళ్ల క్రితం నుంచే అక్కడకు వెళ్లి సెటిలవడం కామన్ అయిపోయింది. ఈ తరహాలో న్యూయార్క్ - బోస్టన్ నగరాల మధ్యన ఉన్న సౌత్ విండ్ స్టర్ పట్టణంలో సేవలు అందిస్తున్న వైద్యురాలు ఉమ మధుసూధన్ కి గొప్ప అనుభవం ఎదురయ్యింది. ఎక్కడి నుంచో వచ్చి ప్రాణాలకు రిస్క్ చేసి కరోనా నుంచి తమను కాపాడుతున్న డాక్టరు ఉమకు స్థానిక అమెరికన్లు పెద్ద ఎత్తున తరలివచ్చి కృతజ్జతలు తెలిపారు. భారీ సంఖ్యలో వాహనాలు ర్యాలీగా వచ్చి ఆమెకు కృతజ్జతపూర్వక వందనం తెలిపాయి. ఇది బాగా వైరల్ అయ్యింది.

డాక్టరు ఉమమధుసూధన్ తల్లిదండ్రులు మైసూరుకు చెందిన వారు. ఆమె ఇక్కడే పుట్టింది. డాక్టరుగా అక్కడ స్థిరపడ్డారు. ఎన్నారై సర్కిల్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. అమెరికా - యూరప్ ఖండాల్లో మన వైద్యులకు విలువ ఎక్కువ. సాధారణంగా వారు వైద్యులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. మన దేశంలో ఒకవైపు మన డాక్టర్ల మీద మనవాళ్లే దాడులు చేస్తుంటే... అమెరికన్లు మన సేవలను గుర్తించి ఇలా గౌరవించడం గణనీయమైన విషయం. కరోనాపై యుద్ధంలో మన తరఫున పోరాడుతున్నది వైద్యుడే. వారే లేకపోతే సగం భూగోళం ఇపుడు ఖాళీ అయ్యేది. వైద్యం చేస్తూనే ఎంతో మంది కరోనాకు బలవుతున్నారన్న విషయం తెలిసినా... మనో ధైర్యం కోల్పోకుండా కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్నారు వైద్యులు. వారిని గౌరవించుకోవాల్సిన సందర్భం ఇది.