Begin typing your search above and press return to search.
అమిత్ మిశ్రా అరెస్ట్
By: Tupaki Desk | 27 Oct 2015 10:11 AM GMT టీమ్ ఇండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా అరెస్టయ్యాడు. మహిళపై దాడి కేసులో ఆయన్ను బెంగళూరు పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. తనపై అమిత్ మిశ్రా దాడి చేశాడంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు దాదాపు 3 గంటలు విచారించిన పోలీసులు అనంతరం అరెస్టు చేశారు. అనంతరం మిశ్రా తరఫు న్యాయవాదులు బెయిల్ పేపర్లు దాఖలు చేసి అమిత్ మిశ్రాను విడుదల చేయించారు. సెప్టెంబర్ 25వ తేదీన బెంగళూరులో తాను ఉంటున్న హోటల్ గదిలో ఓ అమ్మాయిపై దాడి చేసినట్లు అమిత్ మిశ్రాపై పోలీసు కేసు నమోదైంది. అయితే.. ఈ కేసును ఆమె ఉపసంహరించుకున్నట్లు తొలుత కథనాలు వచ్చినా, ఆ తర్వాత మళ్లీ కేసు విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. దాంతో పోలీసులు కూడా ఈ కేసు విచారణను వేగవంతం చేశారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగియడంతో.. మంగళవారం ఉదయం పోలీసులు మిశ్రాను విచారించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్లు 354 - 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.
కాగా ఇటీవల కాలంలో క్రికెటర్ల ప్రవర్తనపై తరచూ ఏదో ఒక వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ జోరు పెరిగిన తరువాత యువ క్రికెటర్లలో క్రమశిక్షణ లోపిస్తోందన్న వాదనా వినిపిస్తోంది.