Begin typing your search above and press return to search.

మ‌నీ మాది.. క్రెడిట్‌ కేసీఆర్ ది

By:  Tupaki Desk   |   24 May 2017 4:27 AM GMT
మ‌నీ మాది.. క్రెడిట్‌ కేసీఆర్ ది
X
అన‌వ‌స‌ర‌మైన మాట‌లు ఒక్కటి కూడా మాట్లాడ‌కుండానే మంట‌లు పుట్టిస్తున్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ నేత‌ల్ని ఉడికించేస్తున్నాయి. మాట‌కు మాట చెప్పే అల‌వాటుకు భిన్నంగా నోరు క‌ట్టేసుకోవ‌టం వారిని తెగ ఇబ్బంది పెట్టేస్తుంద‌ట‌. తెలంగాణ గ‌డ్డ మీద‌కు వ‌చ్చి.. తెలంగాణలో జెండా ఎగరేస్తాం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాదే అధికారం అంటూ చెబుతున్నా.. చెక్ చెప్ప‌ని రీతిలో ఉండిపోవ‌టాన్ని టీఆర్ఎస్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్లుగా తెలుస్తోంది.

అన్నింటికి మించి.. తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమిత్ షా చేస్తున్న వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ నేత‌ల‌కు కారం రాసుకున్న‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే కేంద్రం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో రాష్ట్రం ఫెయిల్ అయ్యింద‌న్న విష‌యాన్ని తేల్చేసిన అమిత్ షా.. త‌న రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో మ‌రో కీల‌క వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గ‌డిచిన మూడేళ్ల వ్య‌వ‌ధిలో రూ.ల‌క్ష కోట్లను నిధులుగా ఇచ్చింద‌ని.. గ‌తంలో ఏ కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఇంత భారీగా నిధులు ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు.

విభ‌జ‌న చ‌ట్టంలోని ఏపీ.. తెలంగాణ‌ల అసెంబ్లీ సీట్ల పెంపు వ్య‌వ‌హారం పార్ల‌మెంటు ప‌రిధిలో ఉంద‌న్న ఆయ‌న‌.. మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ దూర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తొలిరోజున‌.. కేంద్రం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు ఎంత‌మేర ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయ‌న్న విష‌యం మీద దృష్టి సారించిన అమిత్ షా త‌న రెండో ప‌ర్య‌ట‌న‌లో మాత్రం.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్రంగా ధ్వ‌జ‌మెత్త‌క‌పోయిన‌న‌ప్ప‌టికీ.. టీఆర్ఎస్ స‌ర్కారు ఇమేజ్‌ను దెబ్బ తీసేలా మాట్లాడ‌టం విశేషంగా చెప్పాలి. తెలంగాణ‌లో జ‌రిగిన‌.. జ‌రుగుతున్న అభివృద్ధిలో వాటా కోసం అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు అధికార టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేవిగా చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణ‌కు తామేం చేశామో స‌గ‌ర్వంగా చెప్పుకుంటున్న అమిత్ షా మాట‌ల‌కు అర్జెంట్ గా కౌంట‌ర్ ఇవ్వాల‌ని గులాబీనేత‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అయితే.. అధినేత నుంచి వ‌చ్చిన పరోక్ష సంకేతాల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గ‌డిచిన మూడేళ్ల‌లో తెలంగాణ‌కు బీజేపీ నేతృత్వంలోని మోడీ స‌ర్కారు ఏం చేసింద‌న్న మాట ఎవ‌రి నోట వినిపించ‌కూడ‌ద‌న్న‌ట్లుగా అమిత్ షా మాట‌లు ఉన్నాయి.

అడిగినా.. అడ‌గ‌కున్నా త‌న‌కు తానే తెలంగాణ రాష్ట్రానికి తామేం చేశామో చెప్పేస్తున్నారు అమిత్ షా. తెలంగాణ‌కు ఎయిమ్స్‌.. ఉద్యాన వ‌న వ‌ర్సిటీ.. జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం.. పీవీ న‌ర్సింహ‌రావు వెట‌ర్న‌రీ వ‌ర్సిటీల‌ను ఇప్ప‌టికే మంజూరు చేయ‌ట‌మే కాదు.. ఒక్క మౌలిక వ‌స‌తుల కోసం ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ‌లోసుమారు రూ.40,800 కోట్లు నిధులు ఇచ్చిన‌ట్లుగా స్ప‌ష్టం చేస్తున్నారు. చూస్తుంటే.. కేసీఆర్ చెప్పుకునే అభివృద్ది మొత్తం.. కేంద్రం ఇస్తున్న నిధుల‌తోనే అన్న‌ట్లుగా అమిత్ షా మాట‌లు ఉంటున్నాయ‌న్న సందేహాన్ని గులాబీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.