Begin typing your search above and press return to search.
సెమీఫైనల్ సక్సెస్; బీహార్‌లో కమల వికాసం
By: Tupaki Desk | 11 July 2015 4:15 AM GMTమరికొద్ది నెలల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి అయిన ఎన్డీయేను దెబ్బ కొట్టటమే లక్ష్యంగా జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న శాసనమండలి ఎన్నికల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. మొత్తం 24 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 23 స్థానాలకు సంబంధించిన ఫలితాల్ని వెల్లడించారు.
అయితే..తాజాగా విడుదలైన ఫలితాలు ఎన్డీయే వ్యతిరేక కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే.. ప్రకటించిన 23 స్థానాల్లో ఎన్డీయేకు 12 సీట్లు సొంతం చేసుకోగా.. జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ కూటమికి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి.
దీంతో.. బీహార్‌లో బీజేపీ ఎంత శక్తివంతంగా ఉందన్న విషయం మరోసారి రుజువైందని చెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో బీజేపీ అధినేత అమిత్‌షా స్పందిస్తూ.. జనతాపరివార్ పేలని టపాసుగా పేర్కొన్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదలైన ఫలితాలు భవిష్యత్తు ఫలితాల్ని చెప్పకనే చెబుతుందన్న వాదన వినిపిస్తోంది.