Begin typing your search above and press return to search.
భారతీయ గే వివాహం ఎందుకు వైరల్ అయిందంటే...
By: Tupaki Desk | 25 July 2019 1:49 PM GMTమనసు పడితే మనువు ఆడేందుకు లింగం అడ్డంకి కాదనే భావనతో స్వలింగ సంపర్క వివాహాలు గత కొద్దికాలంగా పెద్ద ఎత్తున్నే జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మొదలైన ఈ పోకడ మనదేశంలోనూ గత కొద్దికాలంగా కనిపిస్తోంది. అయితే గతంలో లోలోపల జరిగే ఈ తరహా వివాహాలు ఇప్పుడు బహిర్గతంగా సాగుతున్నాయి. అయితే, అమెరికాలో ఇద్దరు భారతీయ పురుషులు చేసుకున్న `గే వివాహం` సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ కు చెందిన అమిత్ షా - ఆదిత్య మదిరాజు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు సైతం తెలియజేశారు. దీంతో వారు కూడా అంగీకరించారు. న్యూజెర్సీలో రాబిన్స్ విల్ లోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిర్ లో భారత సంప్రదాయంలో వివాహం జరుపుకున్నారు. అబ్బాయి - అమ్మాయి పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగదేమో అన్నంతగా తల్లిదండ్రులు - స్నేహితులు దగ్గరుండి జరిపించిన ఈ వివాహం అట్టహాసంగా సాగింది. ఈ అట్టహాస వివాహం ఫొటోలు ఇన్స్ట్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. పెద్దల మధ్య సంతోషంగా వివాహం జరడం - దానికి సోషల్ మీడియాలో విశేష స్పందన దక్కడం సంతోషంగా ఉందని ఈ దంపతులు ప్రకటించారు.