Begin typing your search above and press return to search.
'అమిత' అహంకారానికి మోడీ దన్నే కారణం!
By: Tupaki Desk | 14 April 2016 4:09 AM GMTసేన చెడుగైన దండనాధుని తప్పు అంటారు పెద్దలు.. అవును మరి అనుచరులు అహంకార పూరితంగా వ్యవహరిస్తే దానికి సంబంధించి బాధ్యత వహించాల్సింది అక్షరాలా వారికి నిత్యం కొమ్ముకాస్తూ ఉండే నాయకుడే. ఈనీతి ప్రకారం చూస్తే.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాడితప్పి అహంకారపూరితంగా వ్యవహరించినట్లయితే.. దానికి ఆయనకు గురుతుల్యుడు, ఆయనను తీసుకు వచ్చి ఆ పదవిలో కూర్చుండబెట్టిన నరేంద్రమోడీకే విమర్శలు దక్కుతాయి.
అమితమైన అమిత్ షా అహంకారానికి నిదర్శనం రెండు రోజుల కిందట జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలోనే బయటపడింది. ఆ కార్యక్రమంలో ఆయన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి పక్కనే మొదటి వరుసలోనే ఆసీనులయ్యారు. అయితే మొదటి వరుసలో కూర్చున్నందుకు మరింత మర్యాదగా ప్రవర్తించడం అవసరం. అయితే ఆయన అవార్డుల ప్రదానం జరుగుతున్న సమయంలో కాలు మీద కాలు వేసుకుని అహంకారంగా కూర్చున్నట్లు కనిపించారు.
మనదేశంలో న్యాయస్థానాల్లోను - తత్సమానమైన న్యాయఅధికారాలు ఉండే రాజ్యాంగబద్ధ పదవుల్లోని రాష్ట్రపతి -గవర్నరు వంటి వారి ఎదుట కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నేరం. దేశాన్ని ఏలుతున్న పార్టీని ఏలుతున్న అమిత్‌షాకు ఇది తెలియకపోవచ్చు.. కానీ తన పక్కన ఉన్నది ఉప రాష్ట్రపతి, ఈ దేశానికి రాష్ట్రపతి తర్వాత రాజ్యాంగ బద్ధంగా అంతటి ఉన్నతమైన పదవిలోని వ్యక్తి.. ఆయన వైపుగా తన పాదం ఉండేలా.. కాలు మీద కాలు వేసుకుని ప్రవర్తించడం సంస్కారం కాదని ఆయనకు ఎందుకు స్ఫురించలేదో తెలియదు. కనీసం మోడీ గణంలోని వారికి సంస్కారం అయినా లేకుంటే ఎలా అని ఈ ఫోటో చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.