Begin typing your search above and press return to search.
అమిత్ షా దెబ్బకు పూజలు నిలిచిపోయాయి
By: Tupaki Desk | 6 Aug 2016 6:59 AM GMTబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పట్టుకు ఇది మరో నిదర్శనం. గుజరాత్ సీఎం ఆనందిబెన్ రాజీనామాతో ఆమె వారసుడిగా ఈ పదవి దక్కేది తనకేనని చివరి క్షణం వరకు ధీమాగా వున్న నితిన్ పటేల్ కు ఉప ముఖ్యమంత్రి పదవి చిక్కింది.అంతిమ క్షణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొని విజయ్ రూపానీకి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ హఠత్ మార్పు వెనుక అమిత్ షా వ్యూహం ఉంది. ఏకంగా స్వీట్లు పంచుకున్న సమయంలో కూడా తన విధేయుడిని సీఎం పీఠంపై అమిత్ షా కూర్చోబెట్టగలిగారు.
గుజరాత్ ముఖ్యమంత్రి పదవి కోసం మొదటినుంచి కూడా ప్రధాన పోటీదారుగా నితిన్ పటేలే నిలిచారు. అయితే, తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించి ఆయనకు ఆ పదవిని అప్పగించి బుజ్జగించారు. పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో 61 సంవత్సరాల రూపానీని నాయకుడిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా రూపానీ - ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ పేర్లను ఆనందిబెన్ పటేల్ ప్రతిపాదించగా పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. ఈ సమావేశానంతరం అధికారికంగా రూపానీ ఎన్నిక గురించి పరిశీలకుడుగా వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రాష్ట్రంలో అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు స్వయంగా రంగంలోకి దిగిన అమిత్ షా - నితిన్ గడ్కరీలు విస్తృత స్థాయిలో మంతనాలు జరిపారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మొదలు కావాల్సిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం రెండు గంటలు ఆలస్యమైంది. అయితే ఈ సమావేశానికి ముందు అత్యంత నాటకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవి తమ నాయకుడికే దక్కుతుందని నితిన్ పటేల్ విధేయులు ఘంటాపథంగా చెబుతూ వచ్చారు. అంతేకాదు, తాను ముఖ్యమంత్రినైతే ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నానో కూడా జాతీయ చానెళ్లకు నితిన్ పటేల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశారు. ఆయన ఇంట్లో మిఠాయిలు పంచుకోవడం కాదు, పూజలు కూడా జరిగిపోయాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. వెంటనే సమావేశాలమీద సమావేశాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రకటించారు. విజయ్ రూపానీ అమిత్ షాకు సన్నిహితుడైతే, నితిన్ పటేల్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ కు అత్యంత సన్నిహితుడు. 1971లో జనసంఘ్ లో చేరిన రూపాని బీజేపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా కొనసాగుతున్నారు.