Begin typing your search above and press return to search.
మళ్లీ ఢిల్లీకి పరిపూర్ణానంద..షా నుంచి పిలుపు!
By: Tupaki Desk | 19 Oct 2018 4:37 AM GMTఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తికర ఉపన్యాసాలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించే పరిపూర్ణానంద స్వామికి హస్తిన నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. తన ప్రవచనాలతో ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్వామికి.. మిగిలిన వారితో పోలిస్తే కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. హిందుత్వ అంశాలు.. ధర్మాల విషయంలో ఆయన తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుందన్న మాట ఉంది.
హైప్రొఫైల్ ఉన్న వారితో చక్కటి సంబంధాలు ఉన్న ఆయన.. సీత పై ఆ మధ్యన కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ కావటం.. ఆ వివాదంలో భాగంగా కత్తి మహేశ్ తో పాటు.. పరిపూర్ణానందపైనా హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు వేయటం తెలిసిందే. ఈ అంశంపై కోర్టుకు వెళ్లి.. పోలీసుల నిర్ణయం సరికాదన్న మాటతో మళ్లీ హైదరాబాద్ లోకి అడుగుపెట్టిన ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది.
ఆయన బీజేపీలోకి వెళ్లనున్నారని.. తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే.. తన ఢిల్లీ భేటీ గురించి పరిపూర్ణానంద పెదవి విప్పలేదు. అమిత్ షా భేటీకి అసలు కారణాన్ని ఆయన చెప్పలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.
ఈసారి ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో పాటు.. ప్రధాని మోడీని కూడా ఆయన భేటీ అవుతారంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పరిపూర్ణానందకు కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ప్రచార బాధ్యతల్ని ఆయనకు అప్పజెప్పే వీలుందన్న మాట వినిపిస్తోంది. హిందుత్వం.. దేశ భక్తిని కలగలిపి ఉత్తేజపూరిత ప్రసంగాలు చేయటంలో దిట్ట అయిన పరిపూర్ణానందతో దక్షిణాది మదిని గెలవాలని మోడీషాలు ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈసారి ఢిల్లీ భేటీతో అయినా.. పరిపూర్ణానందకు అప్పజెప్పే బాధ్యతల మీద క్లారిటీ వస్తుందేమో చూడాలి.