Begin typing your search above and press return to search.
గాలి దెబ్బకు అమిత్ షా ముఖం చాటేశాడు
By: Tupaki Desk | 28 April 2018 6:05 AM GMTపొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీ వింత వ్యూహం అనుసరిస్తోంది. 50 వేల కోట్ల మైనింగ్ స్కామ్ కు పాల్పడినట్లు గాలి జనార్దన్ రెడ్డి సోదరులపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఈసారి ఎన్నికల్లో గాలి వర్గానికి ఏకంగా 7 టికెట్లు ఇచ్చింది బీజేపీ. గాలి సోదరులైన కరుణాకర్ రెడ్డి - సోమశేఖరరెడ్డిలకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇదంతా గాలి సత్తాను చూసే - బీజేపీ గెలుపు కోసమే అనేది తెలిసిన సంగతే. అయితే అవినీతి కేసులో జైలుకెళ్లొచ్చిన గాలి సోదరులను ఎన్నికల కోసం వాడుకుంటూనే ఉంది. వాళ్లతో లాభం జరగాలని చూస్తోంది అదే సమయంలో పరువు పోవద్దని ప్రయత్నిస్తోంది. ఇందుకు నిదర్శనం...బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాజా పర్యటన అని అంటున్నారు.
అమిత్ షా శుక్రవారం బళ్లారిలో పార్టీ నిర్వహించే ర్యాలీలో పాల్గొని బహిరంగసభలో ప్రసంగించాల్సి ఉండగా అర్ధంతరంగా పర్యటన రద్దు చేసుకున్నారు. వివాదాస్పద మైనింగ్ వ్యాపారులైన గాలి జనార్దన్ రెడ్డి సోదరులతో బహిరంగసభ వేదికను పంచుకునే పరిస్థితి ఉండటంతోనే అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జనార్దన్ రెడ్డికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని అమిత్‌షా ఇప్పటికే స్పష్టంచేశారు. అయితే బళ్లారిలో గాలి సోదరులతో కలిసి ప్రచార సభలో పాల్గొంటే పార్టీకి నష్టం జరుగడం ఖాయమని పార్టీ నేతలు హెచ్చరించడంతో ఆమిత్ షా తన పర్యటన రద్దు చేసుకున్నట్టు సమాచారం.
అయితే కాంగ్రెస్ నేత - కర్ణాటక సీఎం సీఎం సిద్ధరామయ్య ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. కర్ణాటక చరిత్రలో గాలి సోదరులు అతిపెద్ద క్రిమినల్స్ అని, వాళ్లు రాష్ర్టాన్ని పూర్తిగా దోచుకున్నారని సిద్ధరామయ్య విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రెడ్డి సోదరులే కర్ణాటకను ఏలుతారని అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. ఇదిలాఉండగా...మధ్య కర్ణాటక జిల్లాల్లో బీజేపీ ప్రచారాన్ని గాలి జనార్దన్ రెడ్డే చూసుకుంటున్నారు. అవినీతిపై పోరాటం అంటూనే బీజేపీ.. ఆయనతో ప్రచారం చేయించడాన్ని కాంగ్రెస్ తమ ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నది. గాలి జనార్దన్ రెడ్డి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ చెబుతున్నది. మరి సంబంధం లేని వ్యక్తికి చెందిన ఏడుగురికి ఎలా టికెట్లు ఇచ్చారంటూ సొంత పార్టీ కార్యకర్తలే నిలదీయడం బీజేపీని ఇబ్బంది పెడుతోంది. పైగా రాష్ట్ర శ్రేయస్సు కోసం తాను గాలి సోదరులను క్షమించేశానని ఆ పార్టీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప అనడం బీజేపీని మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది.