Begin typing your search above and press return to search.
ఆర్టికల్ 370.. అమిత్ షా హాట్ కామెంట్స్ వైరల్!
By: Tupaki Desk | 14 Oct 2022 7:46 AM GMTజమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించడానికి ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టి నాటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తప్పిదం చేశారని అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు.
ఈ తప్పిదాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ సరిచేశారని చెప్పారు. అమిత్ షా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కేవలం అమిత్ షానే కాకుండా ఇటీవల గుజరాత్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ కూడా దశాబ్దాల తరబడి జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న సమస్యలకు జవహర్‌లాల్ నెహ్రూనే కారణమంటూ మండిపడ్డ సంగతి తెలిసిందే.
'ఆర్టికల్ 370 విధించి జవహార్‌లాల్ నెహ్రూ చేసిన తప్పిదంతో జమ్మూకశ్మీర్‌లో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ దేశంలో ఇతర ప్రాంతాలతో సరిగా కలవలేకపోయింది. ఆ ఆర్టికల్‌ను రద్దు చేయాలని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే నరేంద్ర మోదీ మాత్రమే ఒక్క నిర్ణయంతో దాన్ని తొలగించారు. తద్వారా జమ్మూకాశ్మీర్‌ను దేశంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేశారు' అని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్‌లో బీజేపీ చేపట్టిన గౌరవ్ యాత్రలో పాల్గొన్న అమిత్ షా తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణంపై కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించేదని అమిత్ షా గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం అక్కడ ఆలయ నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేవాలయాలకు ప్రాముఖ్యత పెంచిందన్నారు. ఈ క్రమంలోనే చారిత్రక ప్రసిద్ధి చెందిన సోమ్‌నాథ్, ద్వారక, కాశీ, కేదార్‌నాథ్ వంటి ఆలయాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కనీసం దేశానికి భద్రత కూడా కల్పించలేకపోయారని అమిత్ షా ఎద్దేవా చేశారు. అభివృద్ధి కూడా చేయలేకపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్ పీచమణించిందన్నారు. ఉగ్రవాదులు చేసే దాడులకు సర్జికల్ స్ట్రైక్స్‌తో అడ్డుకట్ట వేసిందన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.