Begin typing your search above and press return to search.

నెహ్రూదే తప్పట.. అమిత్ షా తేల్చేశారు!

By:  Tupaki Desk   |   28 Jun 2019 2:30 PM GMT
నెహ్రూదే తప్పట.. అమిత్ షా తేల్చేశారు!
X
మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఇందిరాగాంధీ- నెహ్రూ- రాజీవ్ గాంధీల పేర్లతోనే తన పుణ్యకాలాన్ని పూర్తి చేసేలా ఉంది. గత ఐదేళ్లూ కూడా అనేక అంశాల్లో నెహ్రూ- ఇందిర- రాజీవ్ లనే నిందితులుగా చూపుతూ వచ్చింది కమలం పార్టీ. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రాజీవ్ గాంధీ పేరు చెప్పే మోడీ రాజకీయం సాగింది. రాజీవ్ గాంధీపై బోలెడన్ని విమర్శలు చేస్తూ, ఆరోపణలు చేస్తూ మోడీ రాజకీయం సాగింది.

ఐదేళ్ల పాలన అనంతరం కూడా అలా మోడీ అసంబద్ధమైన ఆరోపణలతోనే ప్రచారాన్ని సాగించారు. ఎలాగైతేనేం నెగ్గారు. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి నెహ్రూనే విలన్ గా కనిపిస్తూ ఉన్నారు.

కశ్మీర్ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ.. కశ్మీర్ పాపం నెహ్రూదే అని తేల్చారు. అయితే ఈ విషయాన్ని కాషాయధారులు కొత్తగా తేల్చడం లేదు. దశాబ్దాల నుంచి ఇదే చెబుతూ ఉన్నారు. మళ్లీ అదే చెబుతూ ఉన్నారు!

ఈ దశాబ్దాల్లో పదేళ్ల కాలాన్ని బీజేపీ పాలించింది. పదేళ్లకు పైగా కాలాన్ని పాలించింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ చేతిలోనే అధికారం ఉంది. అయినా ఇంకా ఎన్నాళ్లు.. నెహ్రూ పేరుతోనే రాజకీయం చేస్తారో కమలనాథులు. దశాబ్దాల కిందటి కథల గురించి కాకుండా, ప్రస్తుతంలోకి వచ్చి..తాము ఏం సాధించినట్టో, ఏం సాధిస్తున్నట్టో చెబితే ప్రజలకు కూడా కమలనాథులు క్లారిటీ ఇచ్చినట్టుగా అవుతుందని పరిశీలకులు అంటున్నారు.