Begin typing your search above and press return to search.
మేలో గెలవలేనోడివి నవంబరులో ఎలా గెలుస్తావు?
By: Tupaki Desk | 15 Sep 2018 12:44 PM GMTబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ముందస్తు ఎన్నికల హీట్ ను మరింత పెంచారు. రాష్ట్రంలో ఒకరోజు పర్యటనకు వచ్చిన అమిత్ షా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. జమిలి ఎన్నికలకు కేసీఆర్ కూడా మద్దతిచ్చి ఇప్పుడు ముందస్తు కు వెళుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ముందస్తుతో ఎందుకు ప్రజలపై భారం వేస్తున్నారు కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ స్వార్థం కోసమే ముందస్తు ఎన్నికలని ఆరోపించారు. తన కుమారుడి కోసమే ముందస్తు జపమని వ్యాఖ్యానించారు.
ఎంఐఎం కనుసన్నల్లో కేసీఆర్ పాలన సాగుతుతోందని అమిత్ షా దుయ్యబట్టారు. ఎంఐఎం కోసమే తెలంగాణ విమోచనా దినాన్ని ప్రభుత్వం జరపడం లేదని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ లు తెచ్చారన్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించిన అమిత్ షా ఈ విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు - మాజీ సీఎం అంజయ్య పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఎవరు మరిచిపోలేదన్నారు. ``కేసీఆర్ చెప్పిన దళిత్ సీఎం మరిచారు ..కానీ దళితులు మరువలేదు. ఈసారైనా కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తారా? సచివాలయంకు వెళ్ళని సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్మాలి ..?`` అంటూ కేసీఆర్ తీరును ఎద్దేవా చేశారు.
అమరవీరులను - వారి కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని అమిత్ షా మండిపడ్డారు. ``విద్యావ్యవస్థను కేసీఆర్ పట్టించుకోలేదు. ఉస్మానియా - గాంధీ తరహాలోనే కొత్త హాస్పిటల్స్ ఏమయ్యాయి? జిల్లాల్లో 100 పడకల ఆసుపత్రి ఏమైంది? రైతు ఆత్మహత్యల పై.. యువకులు.. అడుగుతున్నారు. రెండు లక్షల.. డబల్ బెడ్ రూమ్ ఏమైంది? కనీసం.. ప్రధాని ఆవాసా యోజన అమలు చేసిన ఇల్లు పూర్తయ్యేవి అది కూడా ఎందుకు చేయలేదు? కొత్త జిల్లాల ఏర్పాటు అయ్యాక ఒక్క జిల్లా అయినా అబివృద్ది జరిగిందా? నగరం - గ్రామం ఏదీ అబివృద్ది జరగలేదు... కష్టాలు పెరిగాయి`` అని అమిత్ షా విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లాలో రైతులకు కేసీఆర్ సర్కార్ బేడీలు వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకరించామన్నారు. కాంగ్రెస్-సీపీఐ-టీడీపీల పొత్తు ప్రజలు హర్షించరని అమిత్ షా అన్నారు.