Begin typing your search above and press return to search.
అయ్యో అమిత్ జీ.. అలా ఎలా అనేశారు?
By: Tupaki Desk | 18 Sep 2016 4:36 AM GMTఅనుకుంటాం కానీ... ఒక్కోసారి ఒక్కో సందర్భంలో చేసిన వ్యాఖ్యలు మనకు తెలియకుండానే మనకో, మన మిత్రులకో రివర్స్ లో తగులుతుంటాయి. రాష్ట్రం వేరయినంత మాత్రాన్న... తెలంగాణలో మాట్లాడిన మాటలు ఏపీలో ధ్వనించకుండా ఉంటాయా? ఈ మాటలు అమిత్ షా మరిచారో లేక టీడీపీ కి పరోక్షంగా దెబ్బ కొట్టాలని భావించారో కానీ హన్మకొండలో ఏర్పాటుచేసిన బీజేపీ సభలో అమిత్ షా ప్రసంగం ఇలాంటి అనుమానాలను కలిగించేలాగే సాగింది. ఈ సభా వేదికపై నుంచి అమిత్ షా మాట్లాడిన మాటలు కేసీఆర్ కు ఏస్థాయిలో తగిలాయో తెలియదు కానీ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఎక్కడో తగిలి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హన్మకొండలోని బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "తెలంగాణకు కేంద్రం ఇప్పటికే సుమారు రూ.90 వేల కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే అవీ ఏమాత్రం ప్రజలకు చేరలేదు! మరి, ఈ నిధులన్నీ ఎక్కడికి వెళుతున్నాయి? కొంతమంది నేతలు టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి వెళుతున్నారు. మరికొంతమంది వైసీపీ నుంచి, ఇంకొంత మంది కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్తున్నారు. వాళ్లంతా ఊరకే వెళతారా? కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఉపయోగిస్తున్నారు" అని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ స్థాయిలో తీవ్రంగా ఆరోపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
అయితే ఈ వ్యాఖ్యలు ఏపీ కి అన్వయించి చూస్తున్నారు కొందరు విశ్లేషకులు. ఏపీకి కేంద్రం ఎన్ని చేసినా.. అవి రాష్ట్రం చేసినట్లే చెప్పుకుంటున్నారని నిన్నటి వరకూ ఏపీ బీజేపీలో ఒక వర్గం తమ స్వరాన్ని వినిపించేది. ఇదే సమయంలో తమ పార్టీ గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేలను నిస్సుగ్గుగా కోట్ల రూపాయలు చెల్లించి - కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యేకి 25 - 35 కోట్ల రూపాయలు ఇస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. అయితే... తెలంగాణలో అధికార పార్టీలో, ఇతర పార్టీ నేతలు ఊరకే వచ్చి చేరతారా? కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఉపయోగిస్తున్నారు అని అమిత్ షా విమర్శించిన నేపథ్యంలో... ఇది ఏపీకి కూడా వర్తిస్తుంది అనుకోవచ్చా? రాష్ట్రం ఏదైనా, పార్టీ ఏదైనా ఫిరాయింపుదారులు డబ్బులకే అమ్ముడుపోతారు.. కానీ ఊరకే వస్తారా అనేది ఇప్పటికే ఏపీ ప్రతిపక్షం వేస్తున్న ప్రశ్నలు. ఇవే ప్రశ్నలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో సంధించారంతే... ప్రాంతం మారింది... ప్రశ్నించిన మనిషి మారారు... మిగిలిందంతా సేం టు సేం!!