Begin typing your search above and press return to search.

షా కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   8 May 2019 4:43 AM GMT
షా కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా!
X
కాంగ్రెస్ నేత‌ల‌కు.. బీజేపీ నేత‌ల‌కు మ‌ధ్య చాలానే వ్య‌త్యాస‌ముంది. బీజేపీ నేత‌లంతా క‌ర‌డుగ‌ట్టిన తీవ్ర‌వాదుల మాదిరి పార్టీ భావ‌జాలంపై వారు ప్ర‌ద‌ర్శించే క‌మిట్ మెంట్ భారీగా ఉంటుంది. సంప్ర‌దాయ రాజ‌కీయ నేత‌ల తీరుతో వారిని అస్స‌లు పోల్చ‌లేం. అలాంటి క‌ర‌డుగ‌ట్టిన క‌మ‌ల‌నాథులు సైతం తాజా ఎన్నిక‌ల్లో త‌మ‌కు బంప‌ర్ మెజార్టీ సాధించ‌టంపై సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి.

రాంమాధ‌వ్ లాంటోళ్లు మేజిక్ ఫిగ‌ర్ కు కాస్త అటుఇటు అన్న‌ట్లు సీట్లు వ‌స్తాయ‌ని చెబుతున్న వేళ‌.. పార్టీ అధినేత అమిత్ షా ప్ర‌ద‌ర్శిస్తున్న కాన్ఫిడెన్స్ ముచ్చ‌ట రేపేలా ఉంది. తాజా ఎన్నిక‌ల్లో తాము భారీ మెజార్టీతో గెలుస్తామ‌న్న ధీమాను ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న నోటి వెంట ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు వ‌చ్చాయి.

త‌మ‌కు 2014 కంటే ఎక్కువ మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మోడీ ప్ర‌భుత్వం సాధించిన ఘ‌న విజ‌యాల్ని ఏక‌రువు పెట్టారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఐదేళ్ల‌లో మోడీ స‌ర్కారు సాధించిన అంశాల్ని.. ఆ మ‌ధ్య వ‌ర‌కూ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ను గొప్ప‌గా చెప్పుకునే వైనానికి భిన్నంగా.. ఇటీవ‌ల జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాది మసూద్ అజార్ ను ఐక్య‌రాజ్య‌స‌మితి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించ‌టం భారీ విజ‌యంగా ఆయ‌న అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం.

క‌మ‌ల‌నాథుల‌కు ఒక ప‌ట్టాన కొరుకుడుప‌డ‌ని ప‌శ్చిమ బెంగాల్ లో తాము అత్య‌ధిక సీట్ల‌ను సాధిస్తామ‌న్న ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌క‌టించిన షా.. జ‌మ్ముక‌శ్మీర్ కు సంబంధించిన ఆర్టిక‌ల్ 370.. 35ఏల‌ను ర‌ద్దు చేయ‌టానికి బీజేపీ క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌క‌టించారు. షా మాట‌ల్లోని కాన్ఫిడెన్స్ ఎంత నిజ‌మ‌న్న‌ది తేలాలంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సింది.