Begin typing your search above and press return to search.
బాబు నెత్తిన బడ్జెట్ ను మించిన గుదిబండ!
By: Tupaki Desk | 3 Feb 2018 10:27 AM GMTబడ్జెట్ కేటాయింపుల్లో నిధులు పొందలేని రాష్ట్రంలో ఎలాంటి పనులు చేసి.. ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలా అనేదొక్కటే ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఎదుర్కొంటున్న సమస్య అన్నట్లుగా చాలా మంది భావిస్తున్నారు. కానీ నిజానికి బడ్జెట్ ను మించి తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టగల కీలకమైన పరిణామం మరొకటి కూడా అదే రోజున చోటుచేసుకుంది. అయితే బడ్జెట్ హడావిడిలో ఆ అంశానికి పెద్దగా ప్రచారం దక్కలేదు. అందువలన దాని గురించిన చర్చలు కూడా తక్కువగానే జరుగుతున్నాయి. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో నష్టం అంటూ ఏదైనా జరిగితే గనుక.. అది ఖచ్చితంగా.. ఈ రెండో పరిణామం వల్లనే ఉంటుందని పలువరు అంచనా వేస్తున్నారు. ఇంతకూ అదేంటో తెలుసా... ’అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఈ ఎన్నికల్లోగా ఉండదు’ అనే కబురు!!
అవును ఈ విషయం దాదాపుగా తేలిపోయినట్లే. సీట్ల పెంపునకు సంబంధించిన ఫైలు అక్కడిదాకా వచ్చింది .. ఇక్కడి దాకా వచ్చింది.. అంటూ ప్రచారం చేసుకోవడం.. ఇతర పార్టీల్లోని నాయకులకు గేలం వేయడం అనేది తెలుగుదేశం నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. దానికి తగ్గట్లుగా కేంద్రంలోని పెద్దలు కూడా ఎన్నడూ ఆ విషయం గురించి సూటిగా ఎక్కడా ఎలాంటి ప్రకటనా చేయకుండా జాగ్రత్తలు పాటించారు. కానీ తొలిసారిగా.. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగురాష్ట్రాల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంలో ఇప్పట్లో సీట్ల పెంపు ఉండదానే సంగతిని తెగేసి చెప్పేశారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణకు నాయకులు చర్యలు తీసుకోవాలని ఆయన మార్గదర్శనం చేశారు.
సీట్ల పెంపు ఉండదు అనే సంగతి కొత్త విషయం కాదు. చాలా కాలం కిందట ప్రధానితో భేటీ అయి వచ్చిన కేసీఆర్.. సీట్లపెంపు ఈసారికి ఉండదు అని తనకు స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు ఢంకా బజాయించి చెప్పారు. నిజానికి సీట్ల పెంపు గురించి తెరాసకు పెద్ద ఆరాటం కూడా లేదని ఆయన సెలవిచ్చారు.
కానీ చంద్రబాబు పరిస్థితి అది కాదు. కేవలం సీట్ల పెంపు అనే ఆశ చూపించి.. ఆయన వైకాపా నుంచి 23 మందిని తన పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా పలువురికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సొంత పార్టీకి ఎంతో కాలంనుంచి సేవలు చేస్తున్న వాళ్లు తిరుగుబాటు స్వరం వినిపిస్తోంటే.. ‘పెంపు’ ఆశచూపి బుజ్జగిస్తున్నారు. కేసీఆర్ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా నేడో రేపో సీట్ల పెంపు అనే మాయమాటలతో చంద్రబాబునాయుడు పలుమార్లు ప్రకటనలు గుప్పించారు.
మొన్నటికి మొన్న 12వ తేదీన మోడీ తో భేటీ అయిన తర్వాత కూడా సీట్ల పెంపు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించారు... అని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనలన్నీ తమ పార్టీలోకి ఇతరుల్ని ఆకర్షించడానికి, ఉన్న వారిలో తిరుగుబాటు రాకుండా చూడ్డానికి! నేటితో క్లారిటీ వచ్చింది. అమిత్ షా మాట అంటే.. అదే చట్టం లాంటిదని అందరికీ తెలుసు. ఇక సీట్లపెంపు ఉండదంటే.. దాదాపుగా వందకు పైగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ రావణకాష్టంలా ముఠా కుమ్ములాటలతో సతమతం కావాల్సిందే అని పలువురు విశ్లేషిస్తున్నారు.
బడ్జెట్ దెబ్బ ప్రస్తుతానికి కనిపిస్తోంది. కానీ.. చంద్రబాబును బెంబేలెత్తించగల అసలు సమస్య ఈ రూపంలో వేచి ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.