Begin typing your search above and press return to search.

అమిత్ షా తిరిగిన నియోజకవర్గాలు ఎన్నంటే!

By:  Tupaki Desk   |   14 May 2019 6:43 AM GMT
అమిత్ షా తిరిగిన నియోజకవర్గాలు ఎన్నంటే!
X
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా అమిత్ షా వ్యూహాల విషయంలో ఎంత పేరు తెచ్చుకున్నారో - అనునిత్యం పార్టీ కార్యక్రమాల్లో తలమునకలు అవుతూ..గ్రౌండ్ వర్క్ కూడా అదే స్థాయిలో చేస్తూ ఉన్నాడు. అమిత్ షా బీజేపీకి సుప్రిమోగా చలామణి అవుతూ ఉన్నాడని చాలా మంది అంటారు. అందు కోసం ఆయన పడుతున్న కష్టం కూడా అలానే ఉంది. ఆ విషయాన్ని తక్కువమంది గ్రహించగలరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యువకుడు - ఎంత ఫిట్ గా ఉన్న వ్యక్తి అయినా.. అమిత్ షాతో పోటీ పడలేడు. అంతలా దూసుకుపోతున్నారు బీజేపీ జాతీయాధ్యాక్షుడు!

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా అమిత్‌ షా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 545 నియోజకవర్గాలకు గానూ 301 స్థానాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుమారు 1.51 లక్షల కిలోమీటర్లు సంచరించారు. ఎన్నికల చాణుక్యుడిగా పేరుగాంచిన అమిత్‌షా బీజేపీని బలోపేతం చేసే దిశగా పలు రాష్ట్రాల్లో తిరిగారు.

ఈ ఏడాది ఆరంభం నుంచి 1.51 లక్షల కిలోమీటర్లు పర్యటించారు. కాంగ్రెస్‌ ను చావుదెబ్బ తీసి కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. ఆయన గత 2014లో బీజేపీ చీఫ్‌ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1,542 పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో ప్రతి నెలా 17,541 కిలోమీటర్లు చొప్పున 10.17లక్షల కిలోమీటర్లు సంచరించారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మూడుసార్లు దేశవ్యాప్తంగా పర్యటించారు. అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతం దిశగా వ్యూహాలు రచించారు.

పలు ఎన్నికల్లో అమిత్‌ షా పర్యటన వివరాలు

– 2014 16లో 191 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
– 2017లో 188 ప్రచార సభలకు హాజరయ్యారు.
– 2018లో 349 సమావేశాలకు హాజరై ప్రసంగించారు.
– 41 శాతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగా.. 59 శాతం ఎన్నికల సభలకు హాజరయ్యారు.