Begin typing your search above and press return to search.
ఏపీ బీజేపీపై అమిత్ షాకు చిన్నచూపా?
By: Tupaki Desk | 22 Feb 2016 7:45 AM GMTమార్చి ఆరో తేదీన రాజమండ్రిలో భారీ బహిరంగ సభ. ఆ తర్వాత తిరుపతి, గుంటూరులోనూ సభలు. అందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు. ఇలా రాష్ట్రవ్యాప్త పర్యటనలు, బహిరంగ సభలతో శ్రేణులను కదిలించాలని ప్రణాళికలు, వీటన్నింటికీ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవడం. ఏపీ బీజేపీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇదీ పరిస్థితి. అయితే మిత్రపక్షమైన టీడీపీ అధికారంలో ఉన్న చోట బీజేపీని బలోపేతం చేయాలనే ఆలోచన. అందుకోసం ఏకంగా ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితుడు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగడం కీలక పరిణామాలకు తార్కాణమని చెప్తున్నారు.
రాష్ట్రం నుంచి కేంద్రమంత్రివర్గంలో భాగస్వామ్యం పంచుకుంటున్న మంత్రులు వెంకయ్య నాయుడు - నిర్మలా సీతారామన్ తో పాటు ఎంపీలు కంభంపాటి హరిబాబు - గోకరాజు గంగరాజులు రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడానికి కారణాలను అమిత్ షాకు విశ్లేషించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ అధిష్టానం అసంతృప్తితో ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీడీపీకి ధీటుగా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ రాష్ట్ర అగ్రనేతలు విఫలమయ్యారని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై ఏకంగా అమిత్ షానే దృష్టిసారించారు. పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి అండగా నిలుస్తున్న తీరును వివరించేందుకు అమిత్ షా పర్యటనలు పెట్టుకున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో అమిత్ షా పర్యటనకు రాకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నియామకం చేపట్టాలని కసరత్తు చేస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు - మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ - మాజీ ఎంపీ కావూరి సాంబశివరావులు కూడా తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న విశాఖ ఎంపీ హరిబాబు కూడా రెండో సారి కొనసాగేందుకు వెంకయ్యనాయుడు అండతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.