Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డికి తలంటిన అమిత్ షా?
By: Tupaki Desk | 23 May 2017 7:17 AM GMTబీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నాయకుడు జి. కిషన్‌రెడ్డికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తలంటినట్లు సమాచారం. కిషన్‌రెడ్డిని తన గెస్ట్‌హౌస్‌కు పిలుపించుకుని ఆయనను మందలించినట్టు సమాచారం. పిలుస్తున్నా వేదికపైకి ఎందుకు రాలేదని, అలగాల్సిన అవసరం ఏముందని కిషన్‌రెడ్డిని అమిత్ షా అడిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అమిత్ షా తనను గెస్టుహౌస్ కు పిలవడంతో బుజ్జగించడానికే అని కిషన్ అనుకున్నారట. కానీ... ఆయన బుజ్జగించకపోగా క్లాస్ పీకడంతో కిషన్ షాక్ తిన్నట్లు తెలుస్తోంది.
అందరూ పార్టీ కోసం పనిచేయాలని.. ఎవరికి వారు పనిచేయడం మానేసి కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు వస్తాయని అన్నట్లు తెలుస్తోంది. కాగా కిషన్ రెడ్డి ఒకప్పటిలా యాక్టివ్ గా ఉండడం లేదు. ఆయన ధోరణేంటో అర్థం కాక పార్టీ నేతలు కూడా గందరగోళంలో ఉన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ యాక్టివ్ గా ఉన్న ఆయన ఈ రోజు కేంద్రంతో పాటు అనేక రాష్ర్టాల్లో అధికారంలోకొచ్చి తిరుగులేని శక్తిగా మారుతున్న సమయంలో ఎందుకిలా ఉంటున్నారో తెలియడం లేదని అంటున్నారు.
కాగా నల్లగొండ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న అమిత్ షా మంగళవారం ఉదయం వెలుగుపల్లి గ్రామంలో పండిట్ దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దళితవాడకు దీన్ దయాళ్ పేరు పెట్టారు. తర్వాత చిన్న మాదారంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు గురించి సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడారు.