Begin typing your search above and press return to search.
నీళ్లేవి...నియాకమాలు ఏవీ....అమిత్ షా
By: Tupaki Desk | 10 Oct 2018 4:42 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కమలనాథులు కాక పుట్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో భారతీయ జనతా పార్టీ కుమ్మక్కయ్యిందన్న వార్తలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు. దీనికి కరీంనగర్ జిల్లాను వేదికగా చేసుకున్నారు కమల దళపతి అమిత్ షా. బుధవారం సాయంత్రం కరీంనగర్ లో జరిగిన బహిరంగ తెలంగాణ రాష్ట్ర సమితి - మహాకూటమి లక్ష్యంగా అమిత్ షా నిప్పులు చెరిగారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగున్నార ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది అమరులైతే ఆ కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పట్టించుకోవడం లేదని.......... "మిస్టర్ కేసీఆర్... ఇదేన అమరులు కుటుంబాలకు ఇచ్చిన గౌరవం" అని నిప్పులు చెరిగారు. తెలంగాణ వ్యాప్తాంగా 1200 మంది అమరులుంటే వారిలో 800 కుటుంబాలకు కనీసం సాయం కూడా అందలేదని అన్నారు. కొత్త రాష్ట్రంలో ఇంటి నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్క తోవ పట్టించిందని మండిపడ్డారు.
తెలంగాణలో తమ వాట నీళ్లు తమకు రాలేదనే ప్రజలు ఉద్యమించారని - ఉద్యోగ నియమకాలలో కూడా తెలంగాణ ప్రజలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారని అమిత్ షా ఎద్దెవ చేసారు. "నాలుగున్నరా ఏళ్లలో 1500 కోట్లు ఖర్చు చేసి ఒక్క చెరువుని బాగు చేయలేదు. ఒక్క లెక్చరర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు." అని అమిత్ షా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం - ఆ పార్టీ నాయకులు చీటికీ మాటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రస్తావన తీసుకుని వస్తున్నారని, నిజానికి ఈ పథకాన్ని ఆ పార్టీ నాయకులే నీరు కార్చారని అమిత్ షా దుయ్యబట్టారు. ఇక మహాకూటమి పేరుతో కలుస్తున్న కాంగ్రెస్ - తెలుగుదేశం - వామపక్షాలు - తెలంగాణ జన సమితి పార్టీలను తెలంగాణ ప్రజలు విశ్వసించే అవకాశం లేదని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మహాకూటమి పేరుతో కాంగ్రెస్ తో ఎలా కలుస్తుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో మజ్లీస్ పార్టీని ఎదుర్కొనే సత్త తెలంగాణ రాష్ట్ర సమితికి - కాంగ్రెస్‌కు కూడా లేవని అమిత్ షా స్పష్టం చేసారు. " మజ్లీస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేది భారతీయ జనతా పార్టీ ఒక్కటే" అని ముక్తాయింపు ఇచ్చారు. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి - తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య ఎలాంటి స్నేహం లేదని చెప్పేందుకే అమిత్ షా కరీంనగర్ సభను ఉపయోగించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.