Begin typing your search above and press return to search.
ఆడియో టేపుల మాటేంది షా?
By: Tupaki Desk | 20 May 2018 4:27 AM GMTఅడ్డంగా బుక్ అయ్యాక కూడా అదే పనిగా కవర్ చేసుకోవటం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. యావత్ దేశం పాలో అయిన కర్ణాటక రాజకీయంలో ఏం జరిగింది? ఎవరేం చేశారన్నది అందరూ చూస్తున్నదే. కళ్లకు కనిపించేదేదీ నిజం కాదన్నట్లుగా కమలనాథుల మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
కర్ణాటక ఫ్లాప్ షో తర్వాత.. ఒక టీవీ షోలో పెదవి విప్పారు అమిత్ షా. పోయిన పరువును తిరిగి తీసుకురాలేకపోయినా.. కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. యడ్డీ రాజీనామా నేపథ్యంలో స్తబ్దుగా అయిన పార్టీలో కదలిక తేవటానికి.. ఎలా బుకాయించాలో పార్టీ వర్గాలకు అర్థమయ్యేలా షా తన వాదనను వినిపించారని చెప్పాలి.
తమ పార్టీ ఎలాంటి ప్రలోభాలకు పాల్పడలేదని.. ఆ పనంతా కాంగ్రెస్ పార్టీనే చేసిందని చెప్పారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన అవినీతి ఆరోపణల్ని తాను సీరియస్ గా తీసుకోవటం లేదన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పును ఇచ్చినట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ పాలనను తిరస్కరించినట్లు షా చెప్పారు. ఒకవేళ ఆయన మాటలే నిజం అనుకుంటే.. ఎమ్మెల్యేల్ని తీసుకురా.. ఒక్కొక్కరికి రూ.5కోట్లు మంత్రి పదవి అని ఒకరు.. రూ.15కోట్లు మంత్రి పదవి అని మరొకరు బేరాలాడిన ఆడియో టేపులు ఎలా వచ్చినట్లు? ఒకవేళ.. అవన్నీ దొంగటేపులుగా ఉంటే.. బీజేపీ ఊరుకునేదా? ఇప్పటికే ఆగమాగం చేసి.. అరెస్ట్‌ల వరకూ వెళ్లేది కూడా. బండారం బయటపడిన తర్వాత కూడా కవర్ చేసుకునే తీరు చూస్తే.. రాజకీయాలు ఎంతలా భ్రష్ఠుపట్టిపోయాన్నది అమిత్ షా తాజా మాటలు చెప్పేస్తాయని చెప్పక తప్పదు.