Begin typing your search above and press return to search.

కంభంపాటికి అమిత్ షా మార్క్ షాక్‌..!

By:  Tupaki Desk   |   30 Oct 2019 4:13 PM GMT
కంభంపాటికి అమిత్ షా మార్క్ షాక్‌..!
X
కంభంపాటి హరిబాబు ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు. విశాఖ ఎమ్మెల్యేగా - ఎంపీగా పని చేసిన వ్యక్తి... బీజేపీలో వెంకయ్యనాయుడు వర్గంగా ముద్రపడిన హరిబాబుకు కొంతకాలంగా పార్టీలో ప్రయారిటీ తగ్గుతూ వస్తోంది. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో అంతా హరిబాబు హవానే నడిచింది. అటు ఏపీ బీజేపీ అధ్యక్షుడి గాను - విశాఖ ఎంపీగా ఉండ‌డంతో పాటు వైఎస్‌.విజ‌య‌ల‌క్ష్మిని ఓడించ‌డంతో ఒక్క‌సారిగా ఆయ‌న హైలెట్ అయ్యాడు. అయితే అదంతా గ‌తం. ఎప్పుడైతే వెంకయ్య ఉప రాష్ట్రపతి అయ్యారో అప్పటి నుంచి బిజెపి అధినాయకత్వం హరిబాబు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తోంది.

ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. తనకు రాజ్యసభతో పాటు ఏపీ కోటాలో కేంద్రమంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి పదవి ఎలా ఉన్నా హ‌రిబాబుకు రాజ్యసభ మాత్రం ఖ‌చ్చితంగా వస్తుందని నిన్న మొన్నటి వరకు రాజకీయ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీపై బాగా ఫోక‌స్ పెట్టిన కేంద్ర‌ హోంశాఖ మంత్రి అమిత్ షా హరిబాబును పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అసలు హరిబాబు వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదన్న అభిప్రాయానికి కూడా కేంద్ర బీజేపీ పెద్ద‌లు వ‌చ్చేశార‌ట‌.

ఆయ‌న నోటి నుంచి మాట బ‌య‌ట‌కు పెగ‌ల‌దు... ఇత‌ర పార్టీల‌పై దూకుడుగా ముందుకు వెళ్ల‌లేరు. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఆయ‌న వీర‌విధేయుడు అన్న ముద్ర‌ప‌డిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాత కొంత‌మంది టీడీపీ నేత‌ల‌ను బీజేపీలోకి పంపుతార‌న్న టాక్ ఉంది కాని... హ‌రిబాబు గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా బాబు మాటే వింటార‌న్న అభిప్రాయం బీజేపీ వాళ్ల‌లో బ‌లంగా ఉంది.

వాస్త‌వానికి వెంక‌య్య ఉప రాష్ట్ర‌ప‌తి అయిన‌ప్పుడే ఆయ‌న కేంద్ర మంత్రి ప‌ద‌వి హ‌రిబాబుకు వ‌స్తుంద‌నుకున్నా అలా జ‌ర‌గ‌లేదు. ఇక ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీలో పాత నాయ‌కులు సోము - పైడికొండ‌లతో పాటు పార్టీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి వాళ్ల‌నే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు... ఇప్పుడు ఎన్నిక‌ల‌య్యాక పార్టీ మారిన వాళ్ల హ‌వానే న‌డుస్తోంది. ఈ టైంలో అస‌లు హ‌రిబాబు గురించి ఏపీ నేత‌లే ఆలోచించ‌డం లేద‌ట‌.

ఇక ఉత్త‌రాంధ్ర‌లో పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నుకుంటే హ‌రిబాబు క‌న్నా పార్టీ దృష్టిలో ఎమ్మెల్సీ మాధ‌వ్ ఉన్న‌ట్టు చెపుతున్నారు. ఆయ‌న కుటుంబం ఆరు ద‌శాబ్దాలుగా బీజేపీలో ఉంది. గాంధీ సంకల్పయాత్ర పేరిట విశాఖ జిల్లా అంతా మాధవ్ పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. బీసీ వ‌ర్గానికి (వెల‌మ‌) చెందిన మాధ‌వ్ అసెంబ్లీలో జ‌గ‌న్‌, చంద్ర‌బాబుల‌ను క‌డిగి పాడేస్తున్నారు. బ‌ల‌మైన వాగ్దాటి - దూకుడుగా ఉండ‌డంతో మాధ‌వ్‌ ను పైకి తీసుకురావాల‌న్న‌దే బీజేపీ ప్లాన్‌. ఇక హ‌రిబాబు ఇప్ప‌టికే సైలెంట్ అయిపోగా ఆయ‌న చ‌రిత్ర ఏపీ రాజ‌కీయాల్లో దాదాపు ముగిసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.