Begin typing your search above and press return to search.
మేం స్నేహం చేస్తాం..మీరు పోరాడండి..షా నీతి
By: Tupaki Desk | 31 Aug 2018 5:46 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై కొద్దికాలంగా హాట్ హాట్ గా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రగతి నివేదన సభ తర్వాత ముందస్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇస్తారన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఆసక్తికకరంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందస్తు సంకేతాన్నిఇచ్చేశారు.
మంత్రాలయం వెళ్లే క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆగిన సందర్భంగా బీజేపీ నేతలతో మాట్లాడిన విషయాల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలో ముందస్తు సంకేతాలున్నాయని.. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలన్న మాటను చెప్పటం చూస్తే.. ముందస్తు పక్కా అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
అంతేనా.. మేం స్నేహితులుగా ఉంటాం.. మీరు మాత్రం కేసీఆర్ పై మీ పోరాటాల్ని ఆపకండి అంటూ షా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నేతల నోటి నుంచి మాటలు రాని విధంగా మారాయని చెబుతున్నారు.ముందస్తుకు అవకాశం ఉందని.. పార్టీ వర్గాలు అలెర్ట్ గా ఉండాలని.. ప్రజలకు బీజేపీ వాణిని వినిపించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలన్న మాటను షా చెప్పినట్లుగా తెలుస్తోంది.
షా మాటలపై తెలంగాణ బీజేపీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాళ్లేమో.. ఢిల్లీలో భుజం భుజం రాసుకుపూసుకు తిరుగుతారు. మేం మాత్రం కత్తులు పట్టుకొని వారితో పోరాడాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున తెలంగాణలో కేసీఆర్.. బీజేపీ ఒక్కటేనన్న భావన ఉందని.. అది పార్టీకి చేసే డ్యామేజ్ అంత ఇంతా కాదని వాపోతున్నారు. షా సరికొత్త నీతి తెలంగాణ బీజేపీ నేతలకు ఒక పట్టాన మింగుడుపడనిదిగా మారింది.