Begin typing your search above and press return to search.

గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెట్టిన అమిత్ షా

By:  Tupaki Desk   |   31 March 2017 4:39 AM GMT
గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెట్టిన అమిత్ షా
X
ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడిగా.. ఆయన ఆలోచనల్ని నిరంతరం ఫాలో అప్ చేస్తూ.. ఎప్పటికప్పుడు ఏమేం చేయాలో చేసేసే అమిత్ షా పేరు విన్నంతనే.. ప్రధాని మోడీ ఫ్రెండ్ గా..బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మాత్రమే గుర్తుకు వస్తారు. అంతేకానీ.. ఆయన ఎమ్మెల్యే అని.. గుజరాత్ రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైనం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసని చెప్పాలి.

నరన్ పుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే అమిత్ షా.. నిత్యం జాతీయ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. అలాంటి ఆయన.. ఎమ్మెల్యేగా తన పాత్రను ఎంతమేర పోషిస్తారో చెప్పే ఉదంతమిది. దాదాపు రెండేళ్ల అనంతరం.. ఎమ్మెల్యేగా గుజరాత్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆయన చివరిసారిగా అసెంబ్లీకి 2015 మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

తాజాగా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టటం.. ఆయన అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచారు. రెండేళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన వెంట.. షా సతీమణి.. కుమారుడు కూడా ఉండటం గమనార్హం. ఈ ఏడాది చివర్లో (నవంబరు)గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం అనివార్యమైన నేపథ్యంలో.. గెలుపు మీద ఇప్పటి నుంచే కసరత్తు మొదలెట్టారు.

గుజరాత్ సీఎంగా మోడీ తిరుగులేని అబిమానాన్ని పొందినప్పటికీ.. ప్రధానిగా ఆయన ఢిల్లీకి వెళ్లిన తర్వాత.. గుజరాత్ లో మోడీ వారసులుగా నియమితులైన ముఖ్యమంత్రులు ప్రబావం చూపించకపోవటం.. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగావీస్తున్న వేళ.. ఈసారి ఎన్నికలు బీజేపీకి కఠిన పరీక్షగా మారనున్నట్లు చెప్పక తప్పదు. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు 150అసెంబ్లీ నియోజకవర్గాల్ని సొంతం చేసుకోవటమే లక్ష్యంగా అమిత్ షా అండ్ కో డిసైడ్ అయ్యిందని చెబుతున్నారు.

ఇప్పటికే గుజరాత్ బీజేపీ నేతలకు.. ఎన్నికల లక్ష్యం గురించి తేల్చి చెప్పిన అమిత్ షా.. అసెంబ్లీలో మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ నేత వాఘేలాను కలిసి మాట్లాడిన అమిత్ షా దాదాపు గంట వరకూమాట్లాడటం గమనార్హం. దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం మర్యాదపూర్వకమేనని చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత గుజరాత్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా హాజరైన అమిత్ షా హాట్ టాపిక్ గా మారారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/