Begin typing your search above and press return to search.
రెండువారాల్లోనే అమిత్ షా మళ్లీ ఆస్పత్రికి..
By: Tupaki Desk | 13 Sep 2020 4:30 AM GMTకరోనా బారినపడ్డ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం కుదుట పడడం లేదు. ఆయన తాజాగా మూడోసారి ఆస్పత్రి పాలయ్యారు. మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో నిన్న రాత్రి ఆస్పత్రికి తరలించారు.
శనివారం రాత్రి 11 గంటలకు అమిత్ షాను ఎయిమ్స్‌లో చేర్చారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని కార్డియో న్యూరో టవర్స్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్ షాను వీవీఐపీలకు కేటాయించిన సీఎస్ టవర్‌లో చేర్చి చికిత్స అందుస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఏర్పడటం వల్లే ఎయిమ్స్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.
అమిత్ షాకు కరోనా సోకి ఇటీవలే కోలుకున్నారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్న అమిత్ షా ఆరోగ్యం శనివారం రాత్రి తిరగబెట్టింది. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. డాక్టర్ల సూచనల మేరకు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఏర్పడటం వల్లే ఎయిమ్స్ అడ్మిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అమిత్ షాకు మరోసారి కరోనా పరీక్షలను నిర్వహించారా? లేదా? అనేది తెలియరావాల్సి ఉంది.
రెండు వారాల వ్యవధిలో షా అనారోగ్యానికి గురికావడం ఇది మూడోసారి. కిందటి నెల 2వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత నెగెటివ్ రావడంతో అదేనెల 14 తేదీన డిశ్చార్జి చేశారు. నాలుగురోజుల తరువాత ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. 18న ఎయిమ్స్‌లో చేరారు. కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ రావడం, ఆరోగ్యం మెరుగు పడటంతో 31వ తేదీన డిశ్చార్జి అయ్యారు.