Begin typing your search above and press return to search.
దసరా తర్వాత షాకివ్వబోతున్న అమిత్ షా!
By: Tupaki Desk | 21 Sep 2019 2:30 PM GMTతెలంగాణ రాజకీయాలను షేక్ చేసే పరిణామాలకు సెప్టెంబర్ 17న స్కెచ్ గీసుకుంది బీజేపీ.. తెలంగాణ విమోచనం వేళ భారీ చేరికలతో గులాబీ పార్టీకి షాకివ్వాలని అమిత్ షా అండ్ టీం భావించిందట.. కానీ అదే రోజు ప్రధాని మోడీ పుట్టిన రోజు వేడుకలను ప్లాన్ చేయడంతో అమిత్ షా టూరు వాయిదా పడింది.
అయితే తాజాగా బీజేపీలోకి భారీగా వలస రావడానికి రెడీ అయిన టీడీపీ - కాంగ్రెస్ నేతల చేరికకు మరో ముహూర్తం ఫిక్స్ చేసినట్టు రాష్ట్ర బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దసరా తర్వాత అమిత్ షా హైదరాబాద్ రావడానికి ఒప్పుకున్నారని.. ఈమేరకు శంషాబాద్ లో సభ ఏర్పాటుకు బీజేపీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ - టీడీపీలోని సీనియర్లు - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల నేతల చేరికకు ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్టు తెలిసింది.
ప్రధానంగా ఉమ్మడి ఏపీలో చంద్రబాబు తర్వాత టీడీపీలో వెలుగు వెలిగిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తోపాటు కాంగ్రెస్ - టీడీపీ నేతలు పలువురు హైదరాబాద్ మైనార్టీ నేతలను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ చర్చలు పూర్తి చేసినట్లు తెలిసింది.
దసరా తర్వాత ఈ భారీ చేరికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోందట.. ఇందులో టీఆర్ ఎస్ అసంతృప్తులు కూడా ఉన్నారని.. లాస్ట్ మినిట్ లోనే అది బయటపెడుతామని బీజేపీ పెద్దలు చెప్పడం కొసమెరుపు. మరి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణతో ఇటీవల గళమెత్తిన చాలా మంది టీఆర్ ఎస్ నేతల్లో ఎవరు బీజేపీ గూటికి చేరుతారనే ఆసక్తి ఇప్పుడు సర్వాత్రా నెలకొంది.