Begin typing your search above and press return to search.
అమ్మ అమిత్ షా.. దేన్ని వదిలిపెట్టవే..
By: Tupaki Desk | 7 April 2016 4:18 AM GMTప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం రాజకీయ నాయకులకు అలవాటే. అభిమానించే వారి అవస్థను సైతం పార్టీకి ప్రయోజనంగా మారే ప్రచారంగా మార్చుకునే బీజేపీ చీఫ్ అమిత్ షా టెక్నిక్ తెలుసుకుంటే ఔరా అనుకోవాల్సిందే. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి పార్టీ నేతలు చెప్పుకోవటం కనిపిస్తుంది. పార్టీ అధినేత ఎంతటి చురుకన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నంలో తాజాగా జరిగిన ఒక ఘటన చూస్తే.. ఎవరు ఎలా ఉన్నా.. ప్రతి విషయంలోనూ తనకు అనుకూలమైన విషయాల్ని వెతుక్కోవటంలో అమిత్ షా తర్వాతే ఎవరైనా అన్న భావన కలగటం ఖాయం.
ఇంతకీ జరిగిందేమంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా అసోంలో రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లారు. హెలికాఫ్టర్ దిగేసరికి అక్కడ వర్షం మొదలైంది. ఎన్నికల ప్రచార సభకు జనం లేకుంటే పరువు పోవటం ఖాయం. అందులోకి పార్టీ చీఫ్ వచ్చిన నేపథ్యంలో.. సభ ఎలా జరుగుతుందన్న భయంతో అసోం నేతలు వణికారట. అమిత్ వస్తున్న నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేసినప్పటికీ.. వాతావరణం అనుకూలించని నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందన్న సందేహం పలువురిలో వ్యక్తమైంది.
అయితే.. ఇలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ అసోం ప్రజలు వర్షం పడుతున్నప్పటికీ సభా స్థలిని విడిచిపెట్టకుండా ఉండిపోయారట. అయితే.. తడవకుండా ఉండటం కోసం.. సభలో వేసిన ఎర్ర కుర్చీల్ని తల మీద పెట్టుకొని నిలబడి వెయిట్ చేస్తున్నారట. వేదిక మీదకు వచ్చిన అమిత్ షా కు ఎర్ర కుర్చీలు నెత్తికి రక్షగా పెట్టుకొని భారీగా జనం వెయిట్ చేస్తున్న సీన్ ఆయన మెదడులో మెరుపులాంటి ఆలోచన వచ్చేలా చేసిందట.
వెంటనే పార్టీ నేతలకు ఆదేశాలిచ్చిన అమిత్ షా.. ఎర్ర కుర్చీల్ని నెత్తికి అడ్డు పెట్టుకొని తన రాక కోసం వెయిట్ చేస్తున్న ఫోటోల్ని తీయాలని.. బీజేపీ సోషల్ గ్రూప్ కి పంపాలని ఆదేశించారట. అసోంలో బీజేపీ సభలకు ఎంతటి ఆదరణ లభిస్తుందన్న దానికి నిదర్శనంగా తాజా ఫోటోలు వాడుకోవాలని డిసైడ్ అయ్యారట. అభిమానంతో పడుతున్న అవస్థల్ని ప్రచారంగా వాడేసుకోవాలన్న అమిత్ షా ఆలోచన చూస్తే.. అందుకే ఆయన మోడీ మనసును అంతలా దోచుకున్నాడనిపించట్లేదు..?