Begin typing your search above and press return to search.
వైసీపీ కరెక్ట్ పొజిషనేంటి...అమిత్ షా చేతుల్లో రిపోర్టు... ?
By: Tupaki Desk | 18 Nov 2021 2:30 AM GMTఅవును. అన్ని ఎన్నికలూ ఎంచక్కా వైసీపీ గెలిచేస్తోంది కదా. ఏపీలో 2024లో కూడా వైసీపీదేనా విజయం. ఇది అందరిలోనూ చర్చగానే ఉంది. మరో వైపు రెండున్నరేళ్ళ పాలన తరువాత కూడా వైసీపీకి జనాల్లో ఎలాంటి వ్యతిరేకత రాలేదా అంటే అది కూడా ఆలోచించాల్సిందే.
ఏపీలో ఆల్ ఈజ్ వెల్ అని వైసీపీ అంటోంది. కాదు వైసీపీ మీద జనాలు పీకల దాకా కోపంతో ఉన్నారని టీడీపీ ఎపుడూ అంటూనే ఉంది. ఇక ఒక్కో సెక్షన్ ద్వారా ఉద్యమం మెల్లగా ఏపీలో మొదలవుతోంది. అది సర్కార్ కి ఉక్కిరి బిక్కిరి చేస్తూ సెగలూ పొగలూ రేపుతోంది. దీంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉందని విపక్షాలు నిర్ధారణకు వచ్చేస్తున్నాయి.
దీని మీద టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే టీడీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని జబ్బలు చరుస్తున్నారు. అదే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే 151 సీట్లలో 15 మాత్రమే వైసీపీకి వస్తాయని నంబర్ కూడా చెప్పారు.
ఇపుడు బీజేపీ వంతు. ఆ పార్టీ నేతలు అయితే 2024లో మేమే అధికారంలోకి రాబోతున్నామని గట్టిగా సౌండ్ చేస్తున్నారు. తాజాగా అమిత్ షా తిరుపతి టూర్ లో కూడా ఇదే విషయాన్ని వారు చెప్పారుట. ఏపీలో వైసీపీ పాలన ఎలా ఉంది. జనాలు ఏమనుకుంటున్నారు అన్న దాని మీద గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి మరీ అమిత్ షాకు బీజేపీ నేతలు అందించారుట.
దాన్ని చూసిన తరువాతనే ఆయన సొంతంగా ఏపీలో బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారట. వాటిని సరిగ్గా వాడుకుంటే 2024లో అద్భుతాలు క్రియేట్ చేయవచ్చునని కూడా షా వారికి దిశానిర్దేశం చేశారుట. ఇంతకీ బీజేపీ అమిత్ షాకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి. ఆయన చేతిలో ఉన్న ఆ నివేదికలో నిజాలు ఏంటి అన్నది కనుక ఆరా తీస్తే చాలా విషయాలే ఉన్నాయట మరి.
ఏపీలో ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకోవడం వల్ల ఆ సెక్షన్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని, అలాగే ఉద్యోగ వర్గాలకు హామీలు గా చెప్పి ఇవ్వాల్సిన వాటిని ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వారు కూడా గుర్రుగా ఉన్నారని పేర్కొన్నారుట.
అదే విధంగా ఏపీలో అన్ని రకాలైన నిత్యావసరాల ధరలు పెరిగాయని, సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోందని, దాంతో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పధకాల కంటే కూడా తడిసి మోపెడు భారం పడుతోందని వారు మండిపోతున్నారని బీజేపీ నేతలు నివేదికలో పేర్కొన్నారుట. అదే విధంగా ఏపీలో అభివృద్ధి ఏ కోశానా లేదని, నిరుద్యోగం తాండవిస్తోందని కూడా అమిత్ షా దృష్టికి తెచ్చారుట.
ఇక కరోనా తరువాత జీవితాలు అన్నీ తారుమారు అయి ప్రజలు మరింతగా ఇబ్బందులో ఉంటే ప్రభుత్వం పరంగా వారికి ఆసరా లేకపోగా ఇబ్బందులు పెరిగిపోయాయని కూడా కమలనాధులు తేల్చేశారుట. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇలా ఉంటే అంతా బాగుందని వైసీపీ నేతలు చెప్పుకుంటూ సంతృప్తి పడుతున్నారని కూడా వారు అన్నారుట.
అయితే ఏపీలో వైసీపీ మీద సమర శంఖం పూరించడానికి ఇదే తగిన సమయం అని అమిత్ షా వారికి సూచించారుట. కేంద్ర నాయకత్వం కూడా ఎప్పటికపుడు తగిన సూచనలు ఇస్తూ కరెక్ట్ డైరెక్షన్ లో నడిపిస్తుందని, అందువల్ల ఏపీలో ఒంటరిగా పోరాడుతూ బీజేపీ బలం పెంచాలని ఆయన కోరారని టాక్.