Begin typing your search above and press return to search.

మోడీ ప‌ర‌మ శివుడు.. నేను జైల్లో ఉన్నాను.. దుమ్మురేపిన షా వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   25 Jun 2022 8:38 AM GMT
మోడీ ప‌ర‌మ శివుడు.. నేను జైల్లో ఉన్నాను.. దుమ్మురేపిన షా వ్యాఖ్య‌లు
X
కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు.. అమిత్ షా.. వ్యాఖ్య‌లు దుమ్మురేపాయి. ఆయ‌న ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. అనేక సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని ఆయ‌న ప‌ర‌మ శివుడితో పోల్చారు. త‌న‌ను తాను.. జైలు ప‌క్షిగా అభివ‌ర్ణించుకున్నారు. పోలీసుల వేధింపులు త‌న‌కు కూడా అనుభ‌వం ఉంద‌ని..చెప్పారు. గుజ‌రాత్ అల్ల‌ర్ల పై న‌రేంద్ర మోడీ చుట్టూ.. అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న 19 ఏళ్ల‌పాటు నోరు క‌ట్టేసుకుని.. ఒక్క ప్ర‌తి విమ‌ర్శ కూడా చేయ‌లేద‌న్నారు.

ప్ర‌స్తుతం షా ఇంట‌ర్వ్యూ.. ఆస‌క్తి రేపుతోంది. పరమ శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని అమిత్ షా అన్నారు. గుజరాత్‌ అల్లర్లపై ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన‌ ఇంటర్య్వూలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీపై ప్రతిపక్షాలు కావాలనే విషప్రచారం చేశాయని ఆరోపించారు.

ఆ బాధను ప్రధాని మోడీ భరిస్తుండటం తాను దగ్గరగా చూశానని అన్నారు. గుజరాత్‌ అల్లర్లలో మోడీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడం శుభపరిణామం అన్నారు. సిట్‌ విచారణను తాము ప్రభావితం చేయలేదని.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని చెప్పారు. ఈ కేసు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని.. కానీ ఇప్పుడదం తా తొలగిపోయిందన్నారు.

"తనపై వచ్చిన ఆరోపణలపై 19 ఏళ్లపాటు ఒక్క మాట మాట్లాడలేదు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకొన్నట్లుగా ఆ బాధను భరించారు. ఆ వేదనను నేను ఎంతో దగ్గరగా చూశాను. ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటం వల్ల ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతో దృఢ సంకల్పం కలిగి ఉంటేనే అలా నిశ్శబ్దంగా ఉండటం సాధ్యం" అని మోడీ గురించి షా వ్యాఖ్యానించారు.

అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరవుతోన్న తీరును తీవ్రంగా నిరసించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణకు హాజరవుతోన్న ఆయనకు మద్దతుగా కేంద్రంపై కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలుపుతున్నారు. 'సిట్ ముందు హాజరయ్యేప్పుడు మోడీ ఎలాంటి హడావుడి చేయలేదు. విచారణను నిరసిస్తూ ధర్నా చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు ఇవ్వలేదు. ఆనాడు సీఎం స్థాయిలో ఉన్నా విచారణకు సహకరించారు" అని అన్నారు.

ఆ అల్లర్ల సమయంలో అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి జాప్యం చేయలేదు. కానీ డీల్లీలో చాలామంది సిక్కులను చంపివేశారు. కానీ ఒక్క అరెస్టు చేయలేదు. మేము పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని వారు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు. నన్ను కూడా జైల్లో పెట్టారు. నేను కూడా పోలీసుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నాను. కానీ ఆ ఆరోపణలన్నీ రాజకీయపూరితమైనవని కోర్టు కూడా చెప్పింది అని తెలిపారు.