Begin typing your search above and press return to search.
కశ్మీర్ విభజనకు రాజ్యసభలో బిల్లు..ఆర్టికల్ 35ఏ - 370 రద్దుకు సిఫారసు
By: Tupaki Desk | 5 Aug 2019 6:03 AM GMTఊహించినట్లే జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం పెద్ద అడుగులు వేసింది. కొద్దిసేపటి కిందట రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ.. చర్చను ప్రారంభించారు. కశ్మీర్ కు సంబంధించి ప్రతి అంశాన్ని చర్చిద్దామని ప్రతిపక్ష నాయకులకు ఆయన సూచించారు. అయితే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలంతా వెల్ లోకి వచ్చి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విపక్షాల అభ్యంతరాల మధ్యే అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
జమ్మూ - కశ్మీర్ రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు బిల్లును ప్రవేశపెడుతున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తీవ్ర గందరగోళం మధ్యే ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
దీనికి ముందు ఉదయం 9.30 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైన కేంద్ర మంత్రి మండలి సమావేశం 10.15 నిమిషాలకు ముగిసింది. అంతకు ముందు అమిత్ షా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో కూడా భేటీ అయ్యారు. రాజ్యసభలో జీరో అవర్ రాజ్యసభ ఛైర్మన్ వాయిదా వేశారు. ఈరోజు అత్యవసర లెజిస్లేటివ్ బిజినెస్ ఉన్నందున జీరో అవర్ వాయిదా వేసి - చట్టపరమైన ఆ కార్యకలాపాల తర్వాత జీరో అవర్ చేపడతామని రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు.
కాగా.. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సభలో ఆమోదింపజేసుకోవడం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో అడ్డుకుని తీరుతామని విపక్షాలు అంటున్నాయి. అయితే.. విపక్షాల బలహీనత నేపథ్యంలో మోదీ ప్రభుత్వం మాటే నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.