Begin typing your search above and press return to search.
షా ఇచ్చే విందుకు జగన్.. కేసీఆర్ లకు ఇన్విటేషన్!
By: Tupaki Desk | 20 May 2019 10:38 AM GMTగెలుపు ధీమాను ప్రదర్శించినప్పటికీ లోలోన ఏదో తెలియని శంక పట్టి పీడించింది ఎన్డీయే వర్గాల్లో. ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని ఎన్డీయే గెలుపు ఖాయమన్న విషయాన్ని దాదాపుగా కన్ఫర్మ్ చేసేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ప్రతి సంస్థా.. ఎన్డీయే మరోసారి అధికారంలోకి రావటం ఖాయమని తేల్చేశాయి.
ఏ సంస్థ కూడా మేజిక్ ఫిగర్ కు ఒక్క సీటు తక్కువ మెజార్టీ వస్తుందన్న మాటను చెప్పింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దాని కంటే పది సీట్లు దాదాపుగా ప్రకటించిన పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ తో ఎన్డీయే వర్గాల్లో.. మరి ముఖ్యంగా మోడీషాలలో జోష్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ నేతృత్వంలో గెలపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేలుస్తున్న వేళ.. ఎన్డీయే పక్షాలకు విందు కు ఆహ్వానించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. మంగళవారం రాత్రి ఢిల్లీలో ఇచ్చే ఈ విందు వేళ.. ఎన్డీయే పక్షాల్లో కొత్త భాగస్వాముల భాగస్వామ్యం ఎంతవరకు ఉంటుందన్నది ఒక సందేహం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త భాగస్వాముల పట్ల బీజేపీ ఆసక్తిని ప్రదర్శిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీల అధినేతల్ని ఈ విందు భేటీకి పిలిచే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
అదే జరిగితే.. కొత్త మిత్రుల వేటను అమిత్ షా అధికారికం చేసినట్లు అవుతుందని చెప్పక తప్పదు. ఒకవేళ.. షా నుంచి విందుకు ఆహ్వానం వస్తే.. అందుకు జగన్ ఎలా రియాక్ట్ అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. షా నుంచి జగన్ కు ఇన్విటేషన్ వస్తుందా? అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.