Begin typing your search above and press return to search.
అరుణాచల్ లో అమిత్ షా ఫిటింగ్
By: Tupaki Desk | 16 Sep 2016 9:57 AM GMTఅరుణాచల్ ప్రదేశ్ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ ఏడాది ఇప్పటికే ఒకసారి సంక్షోభంలో చిక్కుకున్న అరుణాచల్ అసెంబ్లీ మరోసారి అలాంటి పరిణామాలకే వేదికవుతోంది. అక్కడి అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మరోసారి పెద్ద దెబ్బ తగిలింది. శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య రెండుకి పడిపోయింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో 44 మంది ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 42 మంది పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. అక్కడి రాజకీయ పరిణామాలన్నీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంచలనాలకు నిలయంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు బీజేపీ షాక్ ఇస్తూ ఇచ్చిన తీర్పుతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ అధికారంలోకి వచ్చారు. మూడింట రెండు వంతుల మంది ఒకేసారి పార్టీ మారితే వాళ్లకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదన్న సూత్రం ప్రకారం తాజాగా 42 మంది బీజేపీలో చేరబోతుండడడంతో పెమాఖండూ పదవికి కాళ్లొచ్చినట్లే.
ఈ ఏడాది మే నెలలోనే ప్రాంతీయ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ - బీజేపీ మిత్రబంధాన్ని రూపొందించుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బీజేపీ అధికారంలోకి రానుంది. పీఏపీతో కలిసి బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అమిత్ షా పావులు కదుపుతున్నారు. మొత్తానికి అమిత్ షా ఫిటింగుల ముందు అరుణాచల్ కాంగ్రెస్ నేతలు విలవిలలాడుతున్నారట.