Begin typing your search above and press return to search.

బెంగాలీ నేర్చుకుంటున్న షా ..మమత పదవి కి ముప్పేనా !

By:  Tupaki Desk   |   3 Jan 2020 9:30 AM GMT
బెంగాలీ నేర్చుకుంటున్న షా ..మమత పదవి కి ముప్పేనా !
X
ఎవరినైనా ఆకట్టుకోవాలి అంటే ..ముందు మన మాటలు వారికీ అర్థం కావాలి. ఇది రాజకీయాలలో చాలా కీలకం. కొందరు నేతలు తమ సొంత రాష్ట్రాల నుండి కాకుండా పక్క రాష్ట్రాలలో పోటీ చేస్తుంటారు. కానీ , ఆ రాష్ట్ర భాష మాత్రం మాట్లాడలేరు. అక్కడి ప్రజలని ఆకట్టుకోవాలన్న , వారి మద్దతు పొందాలన్నా కూడా భాష కచ్చితంగా రావాల్సిందే. లేకపోతే , అయన ఏమి చెప్పేది కూడా ఎవరికీ అర్థం కాదు. ఇది చాలామంది జాతీయ నేతలు ఎదుర్కొన్న ప్రధాన సమస్య . ఇలాంటి సమస్యని అధిగమించాలనే లక్ష్యం తో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇప్పుడు బెంగాలీ పై పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.

2021లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగ బోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దంలో భాగంగా బెంగాలీ భాష నేర్చుకుంటున్నారు అమిత్ షా. ఇందుకోసం ఓ టీచర్ ని కూడా పెట్టుకున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల బెంగాలీ ఆత్మ గౌరవానికి ప్రాధాన్యమిస్తూ మాట్లాడుతున్నారు.

మమతా బెనర్జీ ఇటీవలి తన ప్రసంగం లో మా మాటీ మనుష్‌ (అమ్మ, మాతృభూమి, ప్రజలు) అనే నినాదాన్ని తెరపైకి తెచ్చి .. బెంగాలీల ఆత్మగౌరవంపై గట్టిగా మాట్లాడారు. అమిత్‌ షాను బయటివ్యక్తి అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం మమతా బెనర్జీ లాంటి పవర్ ఫుల్ లీడర్ ని ఢీ కొట్టే క్రమంలో ప్రాంతీయ భాష చాలా ముఖ్యమని గుర్తించిన షా...ఎన్నికల వ్యూహరచనలో భాష సమస్య రాకూడదు అని భావించి బెంగాలీ నేర్చుకోవడానికి సిద్ధమైయ్యారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది కాబట్టి ప్రచార సమయంలో బెంగాలీలో ప్రసంగించి అక్కడి ప్రజలకు చేరువకావాలని భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహరచనలో అపార చాణుక్యుడిగా పేరున్న అమిత్‌ షా ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం అమిత్ షా అమిత్‌షా గుజరాతీ తోపాటు హిందీలోనూ అనర్గళంగా మాట్లాడగలరు.