Begin typing your search above and press return to search.
20 కిలోల బరువుతగ్గిన అమిత్ షా?
By: Tupaki Desk | 20 Jun 2017 10:08 AM GMTబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 20 కేజీల బరువు తగ్గారట. ఇటీవల దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం, బహిరంగ సభల్లో పాల్గొనడం - దళితుల ఇంట్లో భోజనం వంటి కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్లే సహజంగా తగ్గిపోయి ఉంటారనుకుంటున్నారా? కాదు. యోగా చేయడం వల్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు బరువు తగ్గిపోయారు. ఈ విషయాన్ని యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు.
అమిత్ షా 20 కేజీల బరువు తగ్గడానికి కారణం యోగా చేయడమేనని రాందేవ్ బాబా చెప్పారు. ప్రతి రోజు అమిత్ షా యోగా చేయడం వల్లనే బరువు తగ్గడం సాధ్యమైందన్నారు. యోగా ఒక క్రీడ కాదని కొందరు వ్యక్తులు అంటుంటారు. అటువంటి అపోహాలను తమ మనసులో నుంచి తొలగించుకోవాలన్నారు. యోగా క్రీడల్లో భాగమని రాందేవ్ బాబా స్పష్టం చేశారు. యోగాను ఒలింపిక్స్ క్రీడల్లో భాగం చేయాలన్నారు. రేపు జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రామ్‌దేవ్ అహ్మాదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం యోగాకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఊతమిస్తున్నదని యోగా గురు బాబా రామ్ దేవ్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల మార్గదర్శకాల మేరకు యోగా దినోత్సవ కార్యక్రమం అత్యద్భుతంగా నిర్వహించనున్నారని ఆయన చెప్పారు. అహ్మదాబాద్ లో జిఎండిసి గ్రౌండ్ నుంచి ఎఇఎస్ గ్రౌండ్ వరకూ మొత్తం ఐదు గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 100 గేట్లు ఉన్నాయని, కనీసం 3 నుంచి 4 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని ఆయన అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/