Begin typing your search above and press return to search.
రైతు ఇంట్లో అమిత్ షా భోజనం..కారణం ఇదే
By: Tupaki Desk | 19 Dec 2020 5:30 PM GMTఢిల్లీలో రైతుల నిరసన హోరెత్తుతున్న వేళ అటు మోడీ.. ఇటు అమిత్ షా రైతులను శాంత పరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్రమోడీ తాజాగా ట్విట్టర్ లో వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని ఒక పెద్ద లేఖను విడుదల చేశారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అదే పనిలో పడ్డారు.
పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్న అమిత్ షా తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని బలిజ్యూరి గ్రామంలో ఓ రైతు ఇంట్లో భోజనం చేశారు.ఆయనతోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, బీజేపీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘెష్ కూడా ఉన్నారు.
వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగానే రైతు ఇంటి వద్ద అమిత్ షా భోజనం చేశారు. మిడ్నాపూర్ ర్యాలీ తర్వాత అమిత్ షా రైతు ఇంటికి వచ్చాడు.
తన ఇంటికి అమిత్ షా వచ్చి భోజనం చేయడం సంతోషంగా ఉందని రైతు శానతన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. తానో పేదరైతును అని ఆయన అన్నారు. పప్పుతో అన్నం మాత్రమే పెట్టగలనని చెప్పారు.