Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ 'షా' నే బీజేపీ బాద్ షా!

By:  Tupaki Desk   |   13 Jun 2019 6:26 AM GMT
మ‌ళ్లీ షా నే బీజేపీ బాద్ షా!
X
బీజేపీ అన్నంత‌నే గ‌తంలో ప‌లువురి పేర్లు వినిపించేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందుల్లేకుండా చేశారు మోడీషాలు. ఈ ఇద్ద‌రి పుణ్య‌మా అని బీజేపీ మొత్తం వారిద్ద‌రి చుట్టూనే తిరుగుతోంది. ఒక‌రిద్ద‌రి చుట్టూ తిరిగే పార్టీల‌కు భిన్నంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు అన్ని పార్టీల బాటే ప‌ట్టింది.

ఈ రోజున భార‌తీయ జ‌నతా పార్టీ అన్నంత‌నే న‌రేంద్ర మోడీ.. అమిత్ షా పేర్లే వినిపిస్తాయి. ఈ రోజున బీజేపీ మొత్తం వారిద్ద‌రి చుట్టూనే తిర‌గ‌నుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వారిద్ద‌రి హ‌వా పార్టీలో ఎంత‌గా పెరిగిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

అద్వానీ.. ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి లాంటి సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌ట‌మేకాదు.. త‌ర్వాతి త‌రానికి చెందిన సుష్మ‌.. రాజ్ నాథ్ ల‌ను సైతం పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీలో నెంబ‌ర్ వ‌న్ మోడీ అయితే.. త‌ర్వాతి స్థానం అమిత్ షా.. ఆ త‌ర్వాతి స్థానాల‌న్ని వీరిద్ద‌రే డిసైడ్ చేస్తున్న ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. పార్టీ చీఫ్ గా ఎవ‌రు ఎన్నిక కానున్నార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

2018 డిసెంబ‌రులో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నికైన షా ప‌ద‌వీ కాలం ముగిసింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌ల్ని వాయిదా వేసి.. స్టేట‌స్ కో మొయింటైన్ చేశారు. తాజాగా ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌టం.. ప్ర‌భుత్వం కొలువు తీరిన నేప‌థ్యంలో పార్టీ ప‌గ్గాలు ఎవ‌రికి ఇవ్వాల‌న్న‌ది ఈ రోజు డిసైడ్ చేస్తార‌ని చెబుతున్నారు.

కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో పార్టీ ప‌గ్గాలు మాజీ కేంద్ర‌మంత్రి జేపీ న‌డ్డా.. సీనియ‌ర్ నేత‌లు రాంమాధ‌వ్‌.. ముర‌ళీధ‌ర్ రావుల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. న‌డ్డాను మిన‌హాయిస్తే.. తెలుగువారైన రాంమాధ‌వ్.. ముర‌ళీధ‌ర్ రావులు మోడీషాలకు అత్యంత విధేయుల‌న్న విష‌యం తెలిసిందే.

రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అమిత్ షాకే తిరిగి జాతీయ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు అప్ప‌జెప్పే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్.. క‌ర్ణాట‌క పీఠాల్ని ద‌క్కించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ.. ఇందుకు త‌గ్గ దిశానిర్దేశం షా మాత్ర‌మే చేస్తారంటున్నారు. మ‌రికొద్ది నెల‌ల్లో ఢిల్లీ.. హ‌ర్యానా.. జార్ఖండ్.. మ‌హారాష్ట్రల‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో షాకే మ‌ళ్లీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌టం ఖాయ‌మని చెప్ప‌క త‌ప్ప‌దు. దీనికి సంబంధించిన వివ‌రాలు ఈ మ‌ధ్యాహ్నానానికి రానున్నాయి.