Begin typing your search above and press return to search.

రామోజీ, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల‌ను అమిత్ షా క‌ల‌వ‌డం వెనుక‌.. సీబీఎన్ పాత్ర ఉందా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 5:42 AM GMT
రామోజీ, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల‌ను అమిత్ షా క‌ల‌వ‌డం వెనుక‌.. సీబీఎన్ పాత్ర ఉందా?
X
తాజాగా తెలంగాణలో ప‌ర్య‌టించిన కేంద్ర బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, హోం మంత్రి అమిత్ షా.. వ్య‌వ‌హా రం.. రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. ఆయ‌న వ‌చ్చింది.. మునుగోడు స‌భ‌లో ప్ర‌సంగించి.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు. కానీ, అనూహ్యంగా.. ఈ ప‌ర్య‌ట‌న‌లో అమిత్ షా.. మీడియా మొఘ‌ల్‌.. రామోజీరావుతోను.. దిగ్గ‌జ హీరో..జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనూ భేటీ అయ్యారు. ఇది తొలుత‌.. అమిత్ షా ప‌ర్య‌ట‌న‌లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆయ‌న తెలంగాణ టూర్ షెడ్యూల్‌లో ఎప్పుడు చేరిందో అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకు అనేది కూడా చాలా ఇంట్ర‌స్టింగ్ ఇష్యూనే. అయితే.. అటు రామోజీని తీసుకున్నా.. ఇటు జూనియ‌ర్‌ను తీసుకు న్నా.. ఇద్ద‌రూ కూడా తెలుగు దేశం పార్టీకి వీర విధేయులు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్ర‌మం లో వీరిద్ద‌రితో.. అమిత్ షా భేటీ కావ‌డం.. ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇలా ఇద్ద‌రితోనూ భేటీ వెనుక‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు చ‌క్రం తిప్పి ఉంటార‌ని.. పొలిటిక‌ల్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

రాజ‌కీయ జిమ్మిక్కులు చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన నాయ‌కుడు లేర‌ని అంటారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీతో చెలిమి చేయాల‌ని భావిస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అ డుగులు వేగంగా ప‌డ‌డం లేదు.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే త‌ప్ప‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకో వడం.. బ‌ల‌మైన వైసీపీని కూల‌దోయ‌డం సాధ్యం కాదు.. అన్న‌ట్టుగా.. ప‌రిస్థితి మారిపోయింది. ఈ క్ర‌మం లోనే చంద్ర‌బాబు షాతో రాజ‌కీయాలు న‌డిపిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి సీట్ల కేటాయింపు.. టీడీపీతో ఉంటే.. బీజేపీకి చేకూరే ల‌బ్ధి.. 2014లో ఏం జ‌రిగింది? వంటి అంశాల‌ను.. రామోజీరావు ద్వారా.. అమిత్‌షా చెవిలో చంద్ర‌బాబు ఊదించార‌నే చ‌ర్చ జ‌రుగుతోం ది.

ఇక, జూనియ‌ర్‌ను క‌ల‌వ‌డం ద్వారా.. టీడీపీ ప‌రిస్థితి యువ‌త ప్రాధాన్యం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ పుంజు కునే ప‌రిస్థితిని వివ‌రించార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ క‌లిసి పోటీ చేస్తే.. ఫ‌లితం వ‌స్తుంద‌నే ధీమాను ఆయ‌న‌లోనూ క‌లుగ జేయ‌డం.. ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యంగా చెబుతున్నారు. మొత్తానికి షా భేటీ వెనుక చంద్ర‌బాబు చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు.