Begin typing your search above and press return to search.
షాతో పవార్ రహస్య భేటీ అయ్యారా?
By: Tupaki Desk | 29 March 2021 4:40 AM GMTదేశీయంగా అపర కుబేరుడు కమ్ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద మారణాయుధాలతో కూడిన వాహనం ఉండటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఇలాంటివేళలో.. మహారాష్ట్ర సర్కారు కూటమిలోని కీలక నేత.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రహస్య భేటీ అయినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.
ఇదే అంశాన్ని అమిత్ షాను మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి అడిగినా.. ఆయన స్పందన మరోలా ఉంది. ఎంత సమాచారం చెప్పాలో అంత సమాచారం చెప్పి.. మిగిలిన విషయాల్ని దాటవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిదీ బయటకు చెప్పాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్న అమిత్ షా.. రహస్య భేటీ జరిగిందనటాన్ని ఖండించకపోవటం గమనార్హం.
విలేకరుల వద్ద అమిత్ షా రియాక్షన్ చూస్తే.. మహారాష్ట్ర సర్కారుకు కొత్త గుబులు రేపేలా ఆయన వ్యవహరించారన్న అభిప్రాయం కలుగక మానదు. శరద్ పవార్ తో తాను భేటీ అయ్యానన్నట్లుగా వస్తున్న ప్రచారానికి బలం కలిగించేలా ఆయన స్పందన ఉంది.
నిజానికి.. తనకు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైనప్పుడు మౌనంగా వెళ్లిపోవటం.. లేదంటే అందుబాటులోకే రాకపోవటం తెలిసిన అమిత్ షా.. మీడియా ప్రశ్నించే అవకాశం ఇవ్వటం చూస్తే.. కొత్త ప్లానింగ్ దిశగా పావులు కదులుతున్నాయా? అన్న సందేహం కలిగేలా తాజా పరిణామాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కీలక పరిణామాలకు ఛాన్స్ ఉందంటున్నారు.