Begin typing your search above and press return to search.
సెటిలర్లే గురి.. అందుకే అమిత్ షా అనూహ్య భేటీ
By: Tupaki Desk | 22 Aug 2022 4:22 AM GMTమునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కానప్పటికీ.. ఆ లక్ష్యంగా జరుగుతున్న బహిరంగ సభల్లో భాగంగా తాజాగా బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకావటం తెలిసిందే. 'మునుగోడు సమరభేరి' పేరుతో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావటం.. అంతకుముందు మీడియా మొఘల్ రామోజీతో భేటీ కావటం తెలిసిందే. ఈ రెండు భేటీలో ఒకేసారి చోటు చేసుకోవటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
బీజేపీకి చెందిన కొందరు ముఖ్యుల వాదన ప్రకారం.. వ్యూహాత్మకంగానే రెండు భేటీలు జరిగినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలోని సెటిలర్లను ఆకర్షించటంలో భాగంగానే ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ సాగినట్లుగా చెబుతున్నారు.
జీహెచ్ఎంసీలో సెటిలర్లు ఎక్కువగా ఉండటం.. ఆ మధ్యన జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవటం.. అవన్నీ కూడా సెటిలర్లు ఓట్లు వేసినకారణంగానే కావటం తెలిసిందే. దీంతో.. ఏపీకి చెందిన వారు హైదరాబాద్ లో సెటిల్ అయిన వారంతా బీజేపీపై ఆగ్రహంగా ఉన్నట్లుగా ప్రచారం సాగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంతో వారంతా బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
అందుకే రాబోయే ఎన్నికల్లో ఏపీ సెటిలర్లను ఆకర్షించేందుకు.. వారి మనసుల్ని ప్రభావితం చేసే క్రమంలో భాగంగానే తాజా భేటీ జరిగినట్లుగా చెబుతున్నారు. అమిత్ షా ప్రత్యేకంగా తారక్ తో భేటీ కావటం ద్వారా.. బీజేపీ సానుకూలంగా ఉందన్న సంకేతాల్ని ఇవ్వటంతో పాటు సెటిలర్లను ఆకర్షించేందుకు స్కెచ్ వేసినట్లుగా చెబుతున్నారు. టీడీపీ.. సెటిలర్ల విషయంలో తాము పాజిటివ్ గా ఉన్నట్లుగా సంకేతాలు ఇవ్వటం కోసమే తాజా భేటీ సాగినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. అమిత్ షాతో ఎన్టీఆర్ తో భేటీ సందర్భంగా.. ఆయన్ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతుందన్న చర్చలో ఎలాంటి పస లేదని స్పష్టంచేస్తున్నారు. అసలు అలాంటి అవకాశమే లేదంటున్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేయటం.. ఆయన ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావటం.. తన ప్రాణం ఉండేవరకు టీడీపీలోనే ఉంటానని చెప్పిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరే ఛాన్సులు జీరో అని చెబుతున్నారు. మొత్తంగా ఆదివారం జరిగిన రెండు ప్రత్యేక భేటీలు సెటిలర్లే లక్ష్యంగా సాగినట్లుగా తెలుస్తోంది.