Begin typing your search above and press return to search.
అమిత్ షా నెక్స్ట్ సిట్టింగ్ ఆ టాలీవుడ్ స్టార్ తో....?
By: Tupaki Desk | 23 Aug 2022 5:30 PM GMTఆయన కేంద్ర మంత్రి, అందునా హోం మంత్రి, ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే ఒంటి చేత్తో అటు కేంద్ర సర్కార్ ని ఇటు బీజేపీని నపిస్తున్న రాజకీయ బాహుబలి. అలాంటి అమిత్ షా దగ్గరకే ఎందరో వెళ్తారు. ముఖ్యమంత్రులు అయితే అపాయింట్మెంట్ల కోసం క్యూ కడతారు. అలాంటి అమిత్ షా తానుగా జూనియర్ ఎన్టీయార్ ని పిలిపించుకుని మరీ డిన్నర్ చేశారు. ఇది టాలీవుడ్ తో పాటు దేశ రాజకీయాల్లోనూ అతి పెద్ద చర్చకు దారితీసింది.
అమిత్ షా వంటి అమిత శక్తిసంపన్నుడు ఊరకే తన కాలాన్ని అలా సరదా కబుర్ల కోసం ఖర్చు చేయరని అంతా అంటారు. పైగా తీరిక లేని షెడ్యూల్ పెట్టుకుని వచ్చి అమిత్ షా ఢిల్లీ వెళ్ళాల్సిన టైమ్ ని కూడా మార్చుకుని ముప్పావు గంట జూనియర్ ఎన్టీయార్ కి ఇచ్చారూ అంటే అందులో చాలా పెద్ద విషయమే ఉంటుంది అన్నది రాజకీయాల గురించి ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి అర్ధమయ్యే విషయం.
ఎన్టీయార్ కేవలం ఫిల్మ్ యాక్టర్ మాత్రమే కాదు, సీనియర్ ఎన్టీయార్ కి రాజకీయ వారసుడు కూడా. అదే నందమూరి ఇంటిపేరుతో మూడవ తరం హీరోగా వెండి తెర మీద ఉర్రూతలూగిస్తున్న జూనియర్ ఎపుడో ఒకపుడు రాజకీయ తెర మీద మెరవడం ఖాయమని కూడా అంతా గట్టిగా నమ్ముతారు. ఈ సంగతులు తెలిసే తన తొలి ఓటు, తొలి భేటీ కూడా జూనియర్ తోనే అని అమిత్ షా డిసైడ్ అయ్యారు.
ఈసారికి ఇలా అని అమిత్ షా తెలుగు రాజకీయాల్లో కలి పుట్టించేసి తాను చక్కా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసారు. ఇక జూనియర్ షా మీటింగుల మీద చర్చోపచర్చలు చేస్తూ తెగ ఆయాసపడడమే రాజకీయ వర్గాలకు, విశ్లేషకులకు మిగిలింది. ఈ కధ ఇలా ఉంటూండగానే మరో ప్రచారానికి తెర లేస్తోంది. అమిత్ షా మరో సారి తెలంగాణాలో చేసే టూర్ లో మరింతమంది ప్రముఖులను కలుస్తారుట. అదే విధంగా మరో టాలీవుడ్ బాహుబలిని కూడా ఆయన మీట్ అయ్యే చాన్స్ ఉందిట.
ఆ బాహుబలే రెబెల్ స్టార్ ప్రభాస్ అని అంటున్నారు. ప్రభాస్ పెదనాన్న యూవీ క్రిష్ణం రాజు వెనకటి తరం హీరో. ఆయన రాజకీయాల్లో కూడా చాలా కాలం పాటు ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీ తరఫున ఒకసారి నర్సాపురం, మరోసారి కాకినాడల నుంచి గెలిచారు. ఆ విధంగా చూస్తే కనుక ప్రభాస్ బీజేపీకి దగ్గరవాడే.
దాంతో ఈసారి అమిత్ షా హైదరాబాద్ టూర్ లో ప్రభాస్ తో డిన్నర్ కానీ లంచ్ కానీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ప్రభాస్ ప్రభావం కూడా చాలా ఎక్కువే. ఆయన పాన్ ఇండియా హీరోగా ఒక రేంజిలో ఉన్నారు. దాంతో ఆయన సేవలను కూడా జాతీయ స్థాయిలో ఉపయోగించుకుందామన్న ఆలోచన బీజేపీ పెద్దలకు ఉంది. ఇక క్రిష్ణం రాజు ఎటూ బీజేపీ మనిషిగానే ఉన్నారు. దాంతో ఈసారి షా తో ప్రభాస్ భేటీ ఖాయమని అంటున్నారు.
ఇప్పటికే సినీ రంగం నుంచి మెగాస్టార్ ని దువ్వుతున్నారు. ఇపుడు జూనియర్ తో భేటీ పెట్టారు. ప్రభాస్ ని కూడా కలిసి ముచ్చట్లు పెడితే టాలీవుడ్ లో కీలక నట సమూహాన్ని కమలం నీడకు చేర్చాలన్న పని ఒకటి పూర్తి అవుతుంది. అలాగే ఏపీ లాంటి చోట్ల సామాజిక సమీకరణల సమతూల్యత కూడా పాటించినట్లు అవుతుంది అని బీజేపీ లెక్కలు వేస్తోందిట.
మరి ప్రభాస్ తోనే సరిపెడతారా లేక ట్రిపుల్ ఆర్ లో రామరాజు పాత్రధారి అయిన రామ్ చరణ్ ని కూడా ఇంకో భేటీలో మీట్ అవుతారా అంటే ఏమో బీజేపీ ఆలోచనలు చెప్పడం కష్టం. ఏది ఏమైనా అటు టీయారెస్, ఇటు టీడీపీలు రెండూ చిద్రం కావాలి. తాము ఆ ప్లేస్ లో సెటిల్ అవ్వాలి అన్న వ్యూహాలలో భాగంగానే బీజేపీ ఆపరేషన్ తెలుగు స్టేట్స్ సాగుతోంది అని అంటున్నారు.