Begin typing your search above and press return to search.

అమిత్ చెప్పిన అన్ని కోట్ల లెక్క క‌రెక్టేనా బాబు?

By:  Tupaki Desk   |   26 May 2017 5:23 AM GMT
అమిత్ చెప్పిన అన్ని కోట్ల లెక్క క‌రెక్టేనా బాబు?
X
వినేవాడు ఉంటే చెప్పే వాడు చెల‌రేగిపోతాడ‌ని ... అమిత్ షాని చూసిన‌పుడు అనిపిస్తుంది. త‌న మూడు రోజుల తెలంగాణ రాష్ట్ర పర్య‌ట‌న‌లో కేంద్రం నుంచి తెలంగాణ‌కు వ‌చ్చింది రూ.ల‌క్ష కోట్లు అంటూ ఉద‌ర‌గొట్టేసిన అమిత్ షా.. తాజాగా ఏపీ గ‌డ్డ మీద కాలు పెట్టిన త‌ర్వాత ఏపీ లెక్క చెప్పుకొచ్చారు. గ‌డిచిన మూడేళ్ల వ్య‌వ‌ధిలో మోడీ స‌ర్కారు ఏపీకి అందించిన సాయం రూ.1.75 ల‌క్ష‌ల కోట్లుగా లెక్క‌లు చెప్పారు.

రాష్ట్రానికి ఎన్నో కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్ని ఇచ్చింద‌న్న ఆయ‌న హోదా మాట విభ‌జ‌న చ‌ట్టంలో లేద‌నేశారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ మీద వేలెత్తి చూపుతున్నార‌న్న ఆయ‌న‌.. హోదా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల కంటే ఒక రూపాయి కూడా త‌గ్గ‌కుండా కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక సాయం చేసిందంటున్నారు. కేంద్రంలో మోడీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక‌.. మూడేళ్ల‌లో 106 ప‌థ‌కాల్ని ప్ర‌వేశ పెట్టార‌ని.. ఏపీకి భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేశార‌న్నారు. ఈసారి మోడీ ఏపీకి వ‌చ్చిన‌ప్పుడు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికి ఆయ‌న రుణం తీర్చుకోవాల‌న్న‌ట్లుగా మాట్లాడటం గ‌మ‌నార్హం.

పార్టీని బ‌లోపేతం చేసే విష‌యం మీద నేత‌ల‌కు దిశానిర్దేశం చేసిన ఆయ‌న‌.. విజ‌య‌వాడ‌కు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట‌ను చెప్పుకొచ్చారు. విజ‌య‌వాడ ప్రాంతంలోనే అర్జునుడికి శివుడు పాశుప‌తాస్త్రాన్ని అందించిన‌ట్లుగా నానుడి ఉంద‌ని.. ఇప్పుడు జ‌రుగుతున్న స‌మావేశం భ‌విష్య‌త్తులో బీజేపీ గెలుపున‌కు పాశుప‌తాస్త్రంగా మారాల‌న్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ఏపీ ఎంట్రీ డోర్ కావాల‌న్న ఆయ‌న‌.. ఆగ‌స్టులో రాష్ట్రానికి మ‌రోమారు వ‌స్తాన‌ని.. అప్ప‌టికి ప్ర‌తి బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం పూర్తి కావాల‌ని చెప్పారు. అన్ని మాట‌లు బాగానే ఉన్నాయి కానీ.. ఏపీ రాష్ట్రానికి మూడేళ్ల వ్య‌వ‌ధిలో ఇచ్చిన రూ.1.75ల‌క్ష‌ల కోట్ల లెక్క కాస్త వివ‌రంగా చెబితే బాగుండేదేమో. ఇదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప్ర‌శ్నించాల్సిన అంశాలు ఉన్నాయి.

అమిత్ షా చెప్పిన‌ట్లుగా కేంద్రం నుంచి ఏపీకి రూ.1.75 ల‌క్ష‌ల కోట్లు అందాయా? ఆయ‌న మాట ఎంత‌వ‌ర‌కు నిజం? ఒక‌వేళ అందితే.. ఆ మొత్తాల్ని వేటి కోసం ఖ‌ర్చు చేశారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఒక‌వేళ కేంద్రం నుంచి ఇంత భారీగా నిధులు అందిన‌ప‌క్షంలో భారీ నిధుల్ని ఏం చేశారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/