Begin typing your search above and press return to search.
సారుకు షాకిచ్చేలా అమిత్ షా నెక్ట్స్ ప్లాన్
By: Tupaki Desk | 1 Sep 2019 4:47 AM GMTక్యాలెండర్లో ఉన్న అన్ని నెలలకు భిన్నంగా రెండు నెలలు తెలంగాణ ప్రజలు భావిస్తుంటారు. అందులో ఒకటి సుదీర్ఘకాలంగా తాము కలలు కన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చేసిన జూన్ అయితే.. నిజాం పాలన నుంచి స్వేచ్ఛా గాలులు పీల్చుకునేలా చేసిన సెప్టెంబరును తెలంగాణ ప్రజలు అస్సలు మర్చిపోరు. ఆ రెండు నెలల్లో తెలంగాణ ప్రజల్లో భావోద్వేగం రెగ్యులర్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తామని ఉద్యమ వేళలో మాటలు చెప్పిన కేసీఆర్.. తాను పవర్లోకి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించే విషయంలో కేసీఆర్ సారు మాట మార్చారని చెప్పక తప్పదు.
నిజానికి తెలంగాణ విమోచనకు.. మైనార్టీలకు వేసే లింకులో అర్థం లేదు. పాలకుడు ఏ మతస్తుడు అన్న దాని కంటే.. ఆ రాజు హయాంలో జరిగిన దుర్మార్గాలే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా తెలంగాణ విమోచన విషయంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులతో పాటు.. ప్రస్తుత పాలకులు ఆలోచించటం చిత్రంగా అనిపించక మానదు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పే సీఎం కేసీఆర్.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే విషయంలో మాత్రం తన మాటలకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తుంటారు. ఈ అంశాన్ని తాజాగా టేకప్ చేసిన బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ ను ఇప్పుడు పెద్దది చేయనున్నారు. తెలంగాణలో పట్టు కోసం తహతహలాడుతున్న కమలనాథులు.. ఈ నెలలో వచ్చే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో పాటు.. తామీ వేడుకను భారీగా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని తాము అనుకున్నట్లుగా నిర్వహించిన పక్షంలో తెలంగాణ ప్రజల్లో బీజేపీకి సానుకూలత పెరగటమే కాదు.. రాష్ట్రంలో వారి పట్టు మరింత పెరిచే వీలుంది. అయితే.. రాజకీయంగా తమకు ఇబ్బంది పడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా ఉండటం ద్వారా తెలంగాణలో తన పట్టుకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించాలని భావిస్తోంది.
అందుకోసమే తెలంగాణ విమోచన కార్యక్రమాన్ని నిర్వహించటం ద్వారా భావోద్వేగాల్ని టచ్ చేయాలని భావిస్తున్న కమలనాథులకు తనదైన రీతిలో చెక్ పెట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు చెుతున్నారు. అయితే.. కేసీఆర్ అండ్ కో ప్లానింగ్ మీద అవగాహన ఉన్న కమలనాథులు.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవాన్ని భారీగా నిర్వహించటం ద్వారా కేసీఆర్ కు చెక్ పెట్టటమే కాదు.. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలన్్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తాజాగా బీజేపీ అగ్రనేతల మాటలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ మరో నిజాం మాదిరి వ్యవహరిస్తున్నారని.. ఆయన మెడలు వంచి విమోచన దినోత్సవాన్ని జరిపే సత్తా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఉందని చెప్పటం చూస్తే.. ఈసారి విమోచన దినోత్సవం మామూలుగా జరగటం లేదన్న విషయాన్ని చెప్పేస్తుందని చెప్పాలి. మొత్తంగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చోటు చేసుకునే పరిణామాలు తెలంగాణ దశను.. దిశను అంతో ఇంతో మార్చటం ఖాయమని చెప్పకతప్పదు.