Begin typing your search above and press return to search.
సీట్ల పెంపుతో లాభం సున్నా అని తేల్చేసిన అమిత్ షా
By: Tupaki Desk | 5 Jun 2016 9:25 AM GMTతెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల్ని పెంచాలన్న అంశంపై తెలంగాణ అధికారపక్షం చాలానే ఆశలు పెట్టుకుంది. ఇలా నియోజకవర్గాల్ని పెంచటం ద్వారా దాదాపు 34 అసెంబ్లీ స్థానాలు పెరిగి.. వివిధ పార్టీల నుంచి వచ్చే నేతలకు నియోజకవర్గాల్ని కేటాయించటం తేలిక అవుతుందన్నలెక్కలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు చెబుతారు. నిజానికి అసెంబ్లీ సీట్ల పెంపు మీద మనసు పడిన మరో అధినేత కూడా ఉన్నారు. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలని.. ఆ పెంపు ప్రక్రియను 2019 ఎన్నికల నాటికి పెంచుకుంటే ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీలోకి వచ్చిన నేతలకు సీట్ల కేటాయింపు సులభం అవుతుందన్న అంచనా ఉంది. అధికారపార్టీల లెక్కలు ఇలా ఉంటే.. తెలంగాణలో సీట్ల పెంపు కారణంగా తమకు వచ్చే లాభం ఎంతన్న విషయం మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లెక్కలు కట్టటం మొదలెట్టారు.
పలువురు నేతల్ని ఈ అంశంపై తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరారట. తెలంగాణకు చెందిన నేతలు పలువురు ఈ అంశం మీద తమ ఫీడ్ బ్యాక్ ఇచ్చారని.. వాటిని ఏర్చికూర్చిన అమిత్ షా.. సీట్ల పెంపు కారణంగా తమకు వచ్చే లాభం ఏమీ ఉండదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. సీట్లు పెరగటం ద్వారా తెలంగాణ అధికారపక్షం తన పవర్ తో ఇతర పార్టీల్లోని బలంగా ఉన్న నేతల్ని ఆకర్షిస్తుందని.. అదే జరిగితే సీట్ల పెంపు వ్యవహారం టీఆర్ఎస్ కే తప్పించి బీజేపీ ఇసుమంత కూడా లాభం చేకూరదన్న లెక్కను అమిత్ షా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమకేమాత్రం లాభం కలగని అంశం మీద మోడీ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారిందని చెప్పాలి.