Begin typing your search above and press return to search.
కేసీఆర్ మీద షా ఫోన్ కాల్ అంత ఎఫెక్ట్ చూపిస్తుందా?
By: Tupaki Desk | 26 July 2019 5:32 AM GMTమొనగాడు కేసీఆర్.. ఎవరైనా సరే బస్తీ మే సవాల్ అన్నట్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగేలా ప్రయత్నిస్తే వారిపై సింగంలా విరుచుకుపడతారన్నవన్నీ పాత మాటలుగా మారాయా? గతంతో పోలిస్తే గులాబీ బాస్ ప్రతి విషయానికి రాజీ పడుతున్నారా? పోరాటమే ఆయుధంగా మార్చుకొని అలుపెరగని రీతిలో శ్రమించిన కేసీఆర్.. ఇప్పుడు తన ప్రధాన అస్త్రాన్ని పక్కన పెట్టేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
తాజాగా రాజ్యసభలో సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించుకునే విషయంలో మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై పలువురు తప్పు పడుతున్నారు.సమాచారహక్కు చట్టానికి తూట్లు పొడిచేలా.. దాని స్ఫూర్తిని దెబ్బ తీసేలా మోడీ సర్కారు మార్పులు చేర్పులుచేసిందన్న వాదనను విపక్షాలు వినిపిస్తున్నాయి.
మిగిలిన పార్టీల బాటలోనే టీఆర్ ఎస్ కూడా తన వాదనను వినిపించింది. అంతేకాదు.. తాజాగా మోడీ సర్కారు తలపెట్టిన సవరణల్ని వ్యతిరేకిస్తూ సెలెక్ట్ కమిటీని నియమించాలన్న విపక్ష ఎంపీల లేఖపైన టీఆర్ ఎస్ ఎంపీలు సంతకాలు చేయటమే కాదు.. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడతామన్న మాటను చెప్పారు.
అలాంటిది.. తాజాగా బీజేపీ చీఫ్ కమ్ కేంద్ర హోం మంత్రిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న అమిత్ షా నుంచి కేసీఆర్ కు వచ్చిన ఫోన్ కాల్ చూపించిన ఎఫెక్ట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది. సమాచార హక్కు చట్టానికి మార్పులు చేర్పులు చేస్తూ మోడీ సర్కారు తీసుకొచ్చిన సవరణలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి వారిలో కేసీఆర్ కూడా ఉన్నారు. కానీ.. తాము కోరుకున్నట్లుగా చేయాలని తపిస్తున్న మోడీ పరివారం.. అందుకు తగ్గట్లు పావులు కదిపింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమిత్ షా ఫోన్ చేసి.. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారు. అంతే.. అప్పటివరకూ సవరణల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో తమ ఎంపీల చేత విపక్షాలు సంధిస్తున్న లేఖాస్త్రంపై సంతకాలు చేయించి మరీ వెనక్కి తగ్గమని చెప్పటం చూస్తే.. షా ఫోన్ కాల్ కేసీఆర్ మీద మరీ ఇంతలా ప్రభావితం చూపుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తానికి కేసీఆర్ మనసు మార్చే మంత్రం షా దగ్గర ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. లేకుంటే.. కాలుదువ్వి మరి కామ్ అవ్వాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.