Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా ... ఎందుకు చేశారంటే
By: Tupaki Desk | 27 Oct 2021 10:35 AM GMTతెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు రెండు రోజుల క్రితం నారా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని కలుసుకున్న చంద్రబాబు, సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. ఆ తర్వాత మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు.
అయితే కశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్‌షా, మంగళవారం కాశ్మీర్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. అనంతనం కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడం తో అమిత్ షా ను చంద్రబాబు కలువలేకపోయారు. దీంతో చంద్రబాబు బృందం నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే, చంద్రబాబు కలిసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిన అమిత్ షా, బుధవారం స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఏపీలో పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విధ్వంసం జరుగుతోందన్న చంద్రబాబు.. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు తదితర విషయాలను అమిత్ షాకు వివరించారు
ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి సహా కేంద్రంలో పెద్దలను కోరేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాష్ట్రపతిని కలిసి 8 పేజీల మెమోరాండంను అందజేచేశారు. దీంతోపాటు 323 పేజీల పుస్తకాన్ని ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా కలవాలనుకున్నారు. అయితే, అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉండటంతో వీలుపడలేదు. ఇక రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఇచ్చిన మెమోరాండంలో టీడీపీ ప్రధానంగా నాలుగు డిమాండ్లను ప్రస్తావించింది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా పేట్రేగిపోవడమే కాకుండా పోలీసుల అండతో ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడతున్నందున రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు